Krishnamma: మెలోడీ సాంగ్ వదిలిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-08-20T01:58:28+05:30 IST

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Sathya Dev) నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). సంచలన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై..

Krishnamma: మెలోడీ సాంగ్ వదిలిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Sathya Dev) నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). సంచలన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై వి.వి. గోపాలకృష్ణ (V V Gopala Krishna) దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి (Krishna Kommalapati) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న  ఈ చిత్రంలోని ‘ఏమవుతుందో మనలో’ (Emavutundo Manalo) అనే మెలోడీ సాంగ్‌ లిరికల్ వీడియోను.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా పేరున్న హరీష్ శంకర్ (Harish Shankar) చేతుల మీదుగా శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. కాలభైరవ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. సిద్ శ్రీరామ్ ఆలపించారు.


‘ఏమవుతుందో మనలో.. మనలో

మన మనసులలో..

ఏం జరిగిందో కలలో.. కలలో

తల మునకలలో..

ఏం ఎదురైందో  కథలో.. కథలో..

మలి మలుపులలో..

ఏం కదిలిందో ఎదలో.. లోతులో...

ఏ.. చోటైనా.. నీ చూపేనా..’’ అంటూ సాగిన ఈ పాట‌ ప్రేమ‌లోని గాఢ‌త‌ను తెలియ‌జేసేలా ఉంది. మ‌న‌సులోని భావాల‌ను ప్రేమికులు బ‌య‌ట‌కు వ్య‌క్తం చేయ‌లేన‌ప్పుడు మ‌న‌సుల‌తో ఊసులాడుకుంటార‌నేలా హావ భావాల‌ను చ‌క్క‌టి ప‌దాల‌తో వ్యక్తం చేశారు. సిద్ శ్రీరామ్ వాయిస్‌లో ఈ పాట మ‌న‌సుకి హ‌త్తుకునేలా ఉంది. స‌న్ని కూరపాటి విజువ‌ల్స్ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.



Updated Date - 2022-08-20T01:58:28+05:30 IST