Kirayi: ఫస్ట్ లుక్ మరియు టైటిల్ వదిలిన హరీష్ శంకర్

ABN , First Publish Date - 2022-06-09T02:58:18+05:30 IST

‘చీకటి గదిలో చిలక్కొట్టుడు, 24 కిస్సెస్, డియర్ మేఘ’ వంటి చిత్రాలలో హీరోగా నటించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన హీరో త్రిగుణ్ (Thrigun). ప్రస్తుతం ఆయన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కొండా’ (Kondaa) అనే చిత్రం చేస్తున్న విషయం..

Kirayi: ఫస్ట్ లుక్ మరియు టైటిల్ వదిలిన హరీష్ శంకర్

‘చీకటి గదిలో చిలక్కొట్టుడు, 24 కిస్సెస్, డియర్ మేఘ’ వంటి చిత్రాలలో హీరోగా నటించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన హీరో త్రిగుణ్ (Thrigun). ప్రస్తుతం ఆయన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కొండా’ (Kondaa) అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం త్రిగుణ్ నాలుగైదు సినిమాల షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. అందులో గుంటూరు కిరాయి హత్యల నేపథ్యంలో తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్ చిత్రం ‘కిరాయి’ (Kirayi). SAY క్రియేషన్స్, ARK ఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రానికి V.R.K దర్శకుడు. అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరు నిర్మాతలు. బుధవారం హీరో  త్రిగుణ్ పుట్టినరోజు సందర్భంగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో రస్టిక్, రగ్గడ్ లుక్‌లో త్రిగుణ్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) మాట్లాడుతూ.. త్రిగుణ్ నాకు చాలా కాలం నుండి తెలుసు. తను చాలా ఎనర్జిటిక్ హీరో. గతంలో లవ్, కామెడీ వంటి మంచి మంచి సినిమాలు చేశాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూశాను చాలా బాగుంది. తను మొదటిసారిగా డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.. అన్నారు.



చిత్ర దర్శకుడుV. R. K మాట్లాడుతూ.. ‘‘గుంటూరు, పల్నాడు‌లో ఒకప్పుడు ఎక్కువగా కిరాయి హత్యలు జరిగేవి. దాని ఆధారంగా మేము గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తీస్తున్నాము. ఇందులో హీరో కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయవలసి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ చిత్ర కథ. రీసెంట్‌గా ఈ చిత్ర రష్  అండ్ ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)గారు చాలా బాగుందని మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వదిలి.. మా టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన హరీష్ శంకర్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకు మంచి టెక్నీషియన్స్‌తో పాటు.. చక్కని ప్యాడింగ్ మంచి  రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమా. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు. అంతా థ్రిల్ అవుతారు..’’ అని అన్నారు. 


నిర్మాతలు మాట్లాడుతూ.. హరీష్ శంకర్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమా టైటిల్, పోస్టర్స్  ఆయనకి, అలాగే వర్మ గారికి బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా అనుకున్నాక.. గుంటూరు సబ్ జైల్, చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలో కిరాయి హత్యలు చేసి శిక్షలు అనుభవించే వారిపై దర్శకుడు రీసెర్చ్ చేశారు. వాళ్ల జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు, భాధలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయని తెలుసుకున్నాము. హై వోల్టేజ్ యాక్షన్ మూవీ‌లా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. మా హీరో త్రిగుణ్‌కు మా టీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము..’’ అని తెలిపారు.

Updated Date - 2022-06-09T02:58:18+05:30 IST