Harish Kalyan: ప్రేమ వివాహం కాదు.. పెద్దలు కుదిర్చిన అమ్మాయితోనే..
ABN , First Publish Date - 2022-10-28T15:07:16+05:30 IST
తమిళంలో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో హారీష్ కళ్యాణ్ ఒకరు. 2010లో ‘సింధు సమావెలీ’ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..
తమిళంలో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో హారీష్ కళ్యాణ్ ఒకరు. 2010లో ‘సింధు సమావెలీ’ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న హరీష్ గురించి సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటి మీద తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హారీశ్ స్పందించాడు.
అందులో.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు మీడియాలో వచ్చిన వదంతులను హీరో హరీష్ కళ్యాణ్ కొట్టిపారేశారు. తాను ప్రేమ పెళ్ళి చేసుకోవడం లేదని, పెద్దలు కుదిర్చిన అమ్మాయితోనే తన వివాహం జరుగుతుందని ఆయన గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్థానిక తిరువేర్కాడులో ఉన్న కళ్యాణ మండపంలో ఈ వివాహం శుక్రవారం ఉదయం జరుగుతుందని చెప్పారు. ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ‘డీజిల్’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. ఇదికాకుండా మరో మూడు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని హీరో హరీష్ కళ్యాణ్ వివరించారు.