Pawan kalyan: దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం...

ABN , First Publish Date - 2022-09-01T23:11:59+05:30 IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan kalyan) బర్త్‌డే అంటే ఆయన ఫ్యాన్‌కి పండగ లాంటిది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 2న పవన్‌ అభిమానులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చేేస హడావిడి అంతా ఇంతా కాదు. సెలబ్రేషన్స్‌ అనే పదానికే కొత్త బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేేస సంబరాలు చేేస పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ని మరింత కిక్‌ ఇస్తూ..

Pawan kalyan: దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం...

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan kalyan) బర్త్‌డే అంటే ఆయన ఫ్యాన్‌కి పండగ లాంటిది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 2న పవన్‌ అభిమానులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చేేస హడావిడి అంతా ఇంతా కాదు. సెలబ్రేషన్స్‌ అనే పదానికే కొత్త బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసి  సంబరాలు చేసే  పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ని మరింత కిక్‌ ఇస్తూ.. ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu)సినిమా నుంచి పవర్‌ గ్లాన్స్‌ వీడియో రిలీజ్‌ కానుంది. ఈ నెల 2 సాయంత్రం 5:45కి ఈ గ్లాన్స్‌ వీడియో బయటకు రాబోతుంది. ఈ విషయాన్ని చెబుతూ మేకర్స్‌ ఒక పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడదల చేశారు. ‘‘స్వాగతిస్తుంది సమరపథం, దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’’ అని పోస్ట్‌ చేశారు. సత్యం, ధర్మానికి యొక్క పరాక్రమ రథసారధి’’ అంటూ పవన్‌కు అడ్వాన్స్‌ విషెస్‌ చెప్పారు. 


మెలితిప్పిన మీసాలతో, యుద్థరంగానికి రథాన్ని తీసుకొని వెళ్తున్నట్లుగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ స్టిల్‌ని చూసి ఫ్యాన్స్‌ స్టన్‌ అవుతున్నారు. డైరెక్టర్‌ క్రిష్‌, పవన్‌ని ఇప్పటివరకూ చూడని లుక్‌లో చూపించబోతున్నారని ఈ లుక్‌తో అర్థమవుతోంది. మరి బర్త్‌డే రోజు విడుదల చేయనున్న పవర్‌ గ్లాన్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ ‘హరివర వీరమల్లు’గా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి. ఇప్పటివరకూ తెలుగు బాక్సాఫీస్‌కి సోలో హస్బెండ్‌గా ఉన్న పవన్‌ కళ్యాణ్‌, ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్యాన్‌ ఇండియా మార్కెట్‌ని షేక్‌ చేయడం గ్యారెంటీ అని మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. మన కంటెంట్‌ని నెత్తిన పెట్టుకుంటున్న నార్త్‌ వాళ్లకి, క్రిష్‌ అండ్‌ పవన్‌ కళ్యాణ్‌ఎలాంటి ట్రీట్‌ ఇస్తారో చూడాలి.


Updated Date - 2022-09-01T23:11:59+05:30 IST