Pawan Kalyan : అబ్బాయ్ సినిమా డేట్లోనే.. బాబాయ్ సినిమా?

ABN , First Publish Date - 2022-08-23T16:35:54+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ (Harihara Veeramallu) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్‌లో ఇది మొట్టమొదటి జానపద చిత్రమే కాకుండా, తొలి పాన్ ఇండియా సినిమా కూడా. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కాబోతోంది.

Pawan Kalyan : అబ్బాయ్ సినిమా డేట్లోనే.. బాబాయ్ సినిమా?

‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ (Harihara Veeramallu) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్‌లో ఇది మొట్టమొదటి జానపద చిత్రమే కాకుండా, తొలి పాన్ ఇండియా సినిమా కూడా. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కాబోతోంది. ఏయం రత్నం నిర్మాణంలో విజువల్ గ్రాండియర్‌గా, భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర చేస్తుండగా, కథానాయిక నిధి అగర్వాల్ (Nidhi Agarwal) యువరాణిగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakri) అలరించబోతోంది. కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


2024లో జరగబోవు ఎలక్షన్స్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ . ఈ లోపు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఆయన కాల్షీట్స్ కేటాయించబోతున్నారు. చిత్రం ఇప్పటి వరకూ సగం చిత్రీకరణే పూర్తి చేసుకోగా.. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూట్‌ను పూర్తి చేయబోతున్నారు . తాజా సమాచారం ప్రకారం ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ 30న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారని టాక్. అదే కనుక నిజమైతే.. వచ్చే సమ్మర్ లో విడుదల కాబోయే మొట్టమొదటి భారీ చిత్రం ఇదే అవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 14న మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ (Bhola Shankar), 28న సూపర్ స్టార్ మహేశ్ (Mahesh), త్రివిక్రమ్ (Trivikram) చిత్రం విడుదల కాబోతున్నాయి.  


మెగా ఫ్యామిలీకి మార్చ్ నెలతో మంచి పాజిటివ్ సెంటిమెంట్ ముడిపడి ఉంది. ఆ నెల్లో విడుదలైన మెగా హీరోల చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. 1985 మార్చ్ 14న విడుదలైన చిరంజీవి ‘దొంగ’ (Donga) చిత్రం సూపర్ హిట్ అయింది. 1991 మార్చ్ 9న విడుదలైన చిరు ‘కొండవీటి దొంగ’ (Kondaveeti Donga) చిత్రం కూడా సూపర్ హిట్టే. ఇక 2018, మార్చ్ 30న రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ (Rangasthalam) చిత్రం ఏ స్థాయిలో సెన్పేషన్ అయిందో తెలిసిందే. సరిగ్గా ఇదే డేట్లో బాబాయ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కానుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమా అదే డేట్లో విడుదలవుతుందో లేదో చూడాలి. 

Updated Date - 2022-08-23T16:35:54+05:30 IST