'హరిహర వీరమల్లు': కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?

ABN , First Publish Date - 2022-05-04T15:06:26+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా రిలీజ్ విషయమై ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'హరిహర వీరమల్లు': కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా రిలీజ్ విషయమై ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. గత నెల నుంచి వీరమల్లు చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.


అయితే, ఈ సినిమాని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ, ఇప్పుడు ఈ ప్లానింగ్‌లో మార్పులు వచ్చినట్టు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు కొత్త టాక్. అనుకున్న సమయానికి వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవచ్చుననే ఆలోచనతోనే ఇలా రిలీజ్ ప్లాన్ మార్చారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో మేకర్స్ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చేవరకు వేచి చూడాలి. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పవన్ కెరీర్ 'హరిహర వీరమల్లు' ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

Updated Date - 2022-05-04T15:06:26+05:30 IST