Harihara Veeramallu: పవర్ గ్లాన్స్‌తో మొదలైన భారీ ఆఫర్స్..!

ABN , First Publish Date - 2022-09-04T17:26:42+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ఎప్పుడు మొదలైనా మొదటి నుంచే ఆ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. పెద్ద దర్శకుడు, పెద్ద నిర్మాణ సంస్థ..అనేవి కూడా చూడరు.

Harihara Veeramallu: పవర్ గ్లాన్స్‌తో మొదలైన భారీ ఆఫర్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ఎప్పుడు మొదలైనా మొదటి నుంచే ఆ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. పెద్ద దర్శకుడు, పెద్ద నిర్మాణ సంస్థ..అనేవి కూడా చూడరు. హీరో పవన్ కళ్యాణ్..అంతే. ఈ ఒక్క పేరుతోనే సినిమా బిజినెస్ అంతా జరిగిపోతుంది. ఫ్లాపైనా పవన్ ఇమేజ్ చెక్కుచెదరిన సందర్భాలు లేవంటే ఆయన స్టామినా ఏంటో అర్థమవుతుంది. ఆయన నటించిన సినిమా భారీ హిట్ అని స్వయంగా మేకర్స్ వెళ్ళి చెప్పినా చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు తప్ప లెక్కలడిగి నా షేర్ ఎంత..? అని ఆశించింది లేదు అంటుంటారు.


ఇక పవన్ కళ్యాణ్ నటించే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సహా ఏ అప్‌డేట్ వచ్చినా దాన్ని వైరల్ చేస్తారు ఆయన అభిమానులు. ఇదే, సినిమా బిజినెస్‌కి ప్రధాన కారణం కూడా. మరోసారి అలాంటి హీట్ మొదలైందని సోషల్ మీడియాలో తాజాగా వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. పవర్ స్టార్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu). క్రిష్ (Krish) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


అయితే, గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆగిందనే ప్రచారం జరిగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవర్ గ్లాన్స్‌ పేరుతో టీజర్‌ను వదిలారు. ఇది చూసిన ఫ్యాన్స్‌కి పూనకాలొచ్చినంత పనైంది. అయితే, తాజా సమాచారం ప్రకారం వీరమల్లు చిత్రానికి బిజినెస్ మొదలైందట. ముఖ్యంగా హిందీలో థియేట్రికల్ రిలీజ్ కోసం మంచి ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. సౌత్‌లో పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, మొదటిసారి నార్త్‌లో పవన్ సినిమా రిలీజ్ కాబోతుండడం..భారీ ఆఫర్స్ రావడం చూస్తుంటే గ్యారెంటీగా మన గత తెలుగు చిత్రాలు హిందీలో క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను హరిహర వీరమల్లు బ్రేక్ చేస్తుందనిపిస్తోంది. 

Updated Date - 2022-09-04T17:26:42+05:30 IST