HariHaraVeeraMallu: నవరాత్రులలో నవ- ఉత్తేజం!

ABN , First Publish Date - 2022-09-30T17:18:44+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా, క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ (Hari Hara Veeramallu). నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా..

HariHaraVeeraMallu: నవరాత్రులలో నవ- ఉత్తేజం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా, క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ (Hari Hara Veeramallu). నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటించిన ఈ ఎపిక్ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం (AM Rathnam) సమర్పణలో నిర్మాత దయాకర్ రావు (Dayakar Rao) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయో.. తెలియంది కాదు. పవన్ కల్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లుగా అంతా టాక్ నడిచింది. అయితే, అలాంటిదేమీ లేదని, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా.. సంగీత సంచలనం ఎమ్. ఎమ్. కీరవాణి (MM Keeravani) చేసిన ట్వీట్ చూస్తుంటే తెలుస్తుంది.


పవన్ కల్యాణ్‌తో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసిన కీరవాణి.. ‘నవరాత్రులలో నవ- ఉత్తేజం!’ అంటూ తన ఆనందాన్ని తెలియజేశారు. పక్కన ఉన్న బ్యానర్‌లో ‘హరిహర వీరమల్లు -షెడ్యూల్ వర్క్‌షాప్’ అని ఉంది. అంటే షూటింగ్‌కి వెళ్లబోయే ముందు చేసే రిహార్సల్స్ అన్నమాట. మరి ఇది షూటింగ్‌కు సంబంధించా? లేక మ్యూజిక్‌కి సంబంధించా? అనేది ఆ బ్యానర్‌లో తెలియడం లేదు. అయితే..  ఇందుకు ముందు ఎప్పుడూ లేనిది.. పవన్ కల్యాణ్ ఇలా వర్క్‌షాప్‌లో పాల్గొనడం.. ప్రేక్షకులనే కాదు.. ఫ్యాన్స్‌ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్‌లో ప్రతి సినిమాకు ముందు ఇలా వర్క్‌షాప్ నిర్వహిస్తూ ఉంటారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా తన సినిమాలకు ముందు అందరితో వర్క్‌షాప్ నిర్వహిస్తాడనే విషయం తెలిసిందే. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ (HHVM) సినిమాకు కూడా వర్క్‌షాప్ నిర్వహించడం.. అందులో ఎప్పుడూ లేనిది పవన్ కల్యాణ్ ఇన్‌వాల్వ్ అవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇప్పుడిదే.. ఈ సినిమాపై బీభత్సమైన హైప్‌ని క్రియేట్ చేస్తుంది. ‘అన్న ఈ రేంజ్‌లో ఇన్‌వాల్వ్ అవుతున్నాడంటే.. హిస్టరీ రిపీటే’, ‘మీ పక్కన ఉన్న ఆ కుర్రాడు ఎవరు సార్?’ అంటూ ఈ పిక్ పోస్ట్ చేసిన కీరవాణికి మెగాభిమానులు ధన్యవాదాలు చెబుతున్నారు.


ఇక ఈ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2)ను పురస్కరించుకుని చిత్రయూనిట్ ఓ ‘పవర్ గ్లాన్స్’ (Power Glance)ని వదిలిన విషయం తెలిసిందే. ఆ ‘పవర్ గ్లాన్స్’తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా ‘పవర్ గ్లాన్స్’ క్లారిటీ ఇచ్చేసింది. ఈ ప్రచార చిత్రంలో వీర‌మ‌ల్లుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ అత్యున్నత స్థాయిలో ఉంది. మీసం తిప్పి, కదన రంగంలో అడుగుపెట్టి, మల్ల యోధులను మట్టి కరిపిస్తూ శక్తివంతమైన యోధుడు‌గా కనిపించాడు పవర్ స్టార్. ఇక ఆయన తొడగొట్టే షాట్ అయితే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ ‘పవర్ గ్లాన్స్’‌కి గ్రాండియర్‌ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పోస్ట్‌తో కీరవాణి మరోసారి హైలెట్ అయ్యారు. ప్రస్తుతం కీరవాణి చేసిన ఈ ట్వీట్‌తో ‘హరిహర వీరమల్లు’ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.





Updated Date - 2022-09-30T17:18:44+05:30 IST