పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ మూవీతో ఆయన స్టామినా ఏంటో ప్రపంచం మొత్తం చూడబోతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. వకీల్ సాబ్ (Vakeel Saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) లాంటి హిట్స్ తర్వాత క్రిష్ (Krish) దర్శకత్వంలో పవన్ చేస్తున్న వీరమల్లు చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ 17వ శతాబ్దంలోని మొఘలుల కాలంనాటి కథతో తెరకెక్కుతోంది.
పవన్ కెరీర్లో ఇది మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. అంతేకాదు, ఇప్పటి వరకు కూడా పవన్ చేయని పాత్ర ఇది. టీజర్‌తోనే హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు పెరిగాయి. బాహుబలి సిరీస్ తర్వాత వార్ నేపథ్యంగా టాలీవుడ్లో పీరియాడిక్ సినిమాగా హరిహర వీరమల్లు రాబోతోంది. అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో దింపేందుకు చిత్రబృందం సన్నాలు చేస్తోంది. ఇక పవన్ ఈ సినిమాను పూర్తి చేసి హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించబోతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే 2023 సమ్మర్ కానుకగా భవదీయుడు విడుదల చేయనున్నారట.