Happy Birthday సెన్సార్ పూర్తి..

ABN , First Publish Date - 2022-07-02T18:46:43+05:30 IST

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో రితేష్‌ రానా (Rithesh Rana) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్ డే' (Happy Birth Day).

Happy Birthday సెన్సార్ పూర్తి..

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో రితేష్‌ రానా (Rithesh Rana) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్ డే' (Happy Birth Day). 'ఇంటింటికి గన్.. ఎదురులేని ఫన్' అంటూ నవ్వించేందుకు ఈ సినిమా జులై 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ చాలా బాగుందంటూ మూవీ టీమ్‌ను అభినందించారు. 


ఇక ప్రేక్షకులను 'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ బాగా ఆకట్టుకొని సినిమాపై బాగా అంచనాలు పెంచేసింది. ఇందులో లావణ్యతో పాటుగా నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నవీన్ యెర్నేని, వై రవి శంకర్ సమర్పిస్తుండగా, క్లాప్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి, హేమలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా సెన్సార్ పూర్తైన ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.


ఇక లావణ్య త్రిపాఠి నటించిన గత చిత్రం 'చావురు కబురు చల్లగా' ఎంతగా నిరాశపరిచిందో తెలిసిందే. అందుకే, కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఫన్ ఎంటర్‌టైనర్ 'హ్యాపీ బర్త్ డే' మూవీతో రాబోతున్నారు లావణ్య త్రిపాఠి. ఈ సినిమా గనక హిట్ సాధిస్తే మళ్ళీ లావణ్యకు వరుసగా అవకాశాలు రావచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 



Updated Date - 2022-07-02T18:46:43+05:30 IST