Puneeth Rajkumar జీవితంలో అత్యంత సంతోషకరమైన సంఘటన ఇదే.. సరిగ్గా 14 ఏళ్ల క్రితం వాళ్లందరి ముందు..

ABN , First Publish Date - 2021-10-29T23:53:24+05:30 IST

పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఆయన ఫ్యాన్స్‌నే కాదు యావత్ కన్నడ ప్రజల్ని కూడా షాక్‌కి గురి చేసింది. అయితే, పునీత్ ప్రభావం కేవలం శాండల్‌వుడ్‌కే పరిమితం కాలేదు. ఆయనంటే ఇతర సినిమా రంగాల్లోని ప్రముఖులకి కూడా ఎంతో అభిమానం...

Puneeth Rajkumar జీవితంలో అత్యంత సంతోషకరమైన సంఘటన ఇదే.. సరిగ్గా 14 ఏళ్ల క్రితం వాళ్లందరి ముందు..

పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఆయన ఫ్యాన్స్‌నే కాదు యావత్ కన్నడ ప్రజల్ని కూడా షాక్‌కి గురి చేసింది. అయితే, పునీత్ ప్రభావం కేవలం శాండల్‌వుడ్‌కే పరిమితం కాలేదు. ఆయనంటే ఇతర సినిమా రంగాల్లోని ప్రముఖులకి కూడా ఎంతో అభిమానం. అందరితోనూ చాలా ఆహ్లాదంగా ఉండే మృదు స్వభావి పునీత్. ఇక ఆయన జీవితంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌కి కూడా ప్రత్యేక స్థానం ఉంది. 


పునీత్ రాజ్‌కుమార్‌కి బిగ్ బీతో సుదీర్ఘ అనుబంధమే ఉంది. అందుకే, ఆయన హైద్రాబాద్‌లో తాను తీసుకున్న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ తాలూకూ సెరిమనీని స్పెషల్‌గా గుర్తు చేసుకున్నారు, ఓ ఇంటర్వ్యూలో. కన్నడ పవర్ స్టార్ ‘అరసు’ సినిమాలోని తన పాత్రకుగానూ 2007లో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు. అది అందుకునే ప్రత్యేక సందర్భంలో అమితాబ్ కూడా వేడుకలో ఉన్నారు. పునీత్ పేరు అనౌన్స్ కాగానే బిగ్ బీ అన్ని వైపులా పరికించి చూసి చప్పట్లు చరిచారు. వేదిక మీద పురస్కారం అందుకుని క్రిందకు దిగిన పునీత్‌ని బచ్చన్ గాఢంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. కాస్సేపు ముచ్చటించారు. అమితాబ్ లాంటి లెజెండ్‌తో ఆనాటి అనుభవం తన జీవితంలో అత్యంత సంతోకరమైన సంఘటన అంటారు పునీత్... 

Updated Date - 2021-10-29T23:53:24+05:30 IST