Hanu Raghavapudi : తదుపరి చిత్రం ఏంటి?

ABN , First Publish Date - 2022-08-18T19:51:47+05:30 IST

పదేళ్ళ క్రితం టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి (Hanu Raghavapudi ). ఇన్నేళ్ళలోనూ అతడు తెరకెక్కించిన చిత్రాలు ఐదే. వాటిలో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశాజనకమైన ఫలితాల్ని రాబట్టాయి. ఎట్టకేలకు ‘సీతారామం’ (Sitaramam) చిత్రంతో కెరీర్ లో బిగ్ బ్రేక్ అందుకున్నాడు.

Hanu Raghavapudi : తదుపరి చిత్రం ఏంటి?

పదేళ్ళ క్రితం టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి (Hanu Raghavapudi ). ఇన్నేళ్ళలోనూ అతడు తెరకెక్కించిన చిత్రాలు ఐదే. వాటిలో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశాజనకమైన ఫలితాల్ని రాబట్టాయి. ఎట్టకేలకు ‘సీతారామం’ (Sitaramam) చిత్రంతో కెరీర్ లో బిగ్ బ్రేక్ అందుకున్నాడు. చిత్రం ప్రేమాకావ్యమంటూ.. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అతడి రాత, తీత అద్భుతమంటూ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో అతడి బ్యాడ్ ట్రాక్ రికార్డు పూర్తిగా చెరిగిపోయింది. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్‌తో పదేళ్ళ తన స్ట్రగుల్‌ను పూర్తిగా మరిచిపోయాడు హను. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రెడిట్‌తో పెద్ద బ్యానర్స్ నుంచి అవకాశాలొచ్చి పడుతున్నాయి. తదుపరిగా హను రాఘవపూడి ఏ సినిమా తీయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 


దానికి తగ్గట్టుగానే హను రాఘవపూడితో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వారు ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కథ రెడీ అయిపోయింది. హీరో దొరకడం ఒకటే తరువాయి. అయితే ఈ సారి హను జోనర్ మార్చాడు. తనకు బాగా కలిసొచ్చిన ప్రేమకథా చిత్రాల జోనర్ నుంచి పక్కకి వెళుతున్నాడట. ఈ సారి హిస్టారికల్ ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్ ను ఎంపిక చేసుకున్నాడని టాక్. కథ ‘సీతారామం’ తరహాలోనే పీరియాడిక్ జోనర్లో సాగనుంది. సెట్స్‌కి, విజువల్ ఎఫెక్స్ట్‌కు బాగా ప్రాధాన్యం ఉంటుందట. అయితే ఇందులోనూ తన మార్క్ లవ్ ట్రాక్ కూడా ఉండనుందని టాక్.


హను గత చిత్రాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. అతడి లవ్ ట్రాకులకు మంచి పేరొచ్చింది. ‘పడిపడిలేచె మనసు’ (Padipadi leche manasu) చిత్రంలో శర్వానంద్ (Sarvanand), సాయిపల్లవి (Saipallavi) లవ్ ట్రాక్ ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే జోనర్ మార్చుతున్నా.. తదుపరి చిత్రంలో మంచి లవ్ ట్రాక్ ను రాసుకున్నాడట. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి ఈ సినిమాకు హను హీరోగా ఎవరిని ఎంపిక చేస్తాడో చూడాలి. 

Updated Date - 2022-08-18T19:51:47+05:30 IST