ఈ ఏడాది 9 చిత్రాల్లో నటిస్తానంటోన్న హన్సిక

ABN , First Publish Date - 2022-01-07T03:10:06+05:30 IST

ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన హన్సికా మొత్వాని ఆ తర్వాత కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే 2019 నుంచి ఆమెకు ఏమాత్రం కలిసిరావడం లేదు. గత రెండేళ్ళుగా హన్సిక నటించిన చిత్రాలు విడుదలకాలేదు.

ఈ ఏడాది 9 చిత్రాల్లో నటిస్తానంటోన్న హన్సిక

ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన హన్సికా మొత్వాని ఆ తర్వాత కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే 2019 నుంచి ఆమెకు ఏమాత్రం కలిసిరావడం లేదు. గత రెండేళ్ళుగా హన్సిక నటించిన చిత్రాలు విడుదలకాలేదు. ఆమె నటించిన ‘మహా’  ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో 2022లో మాత్రం ఖచ్చితంగా బిజీగా ఉంటానని చెబుతోంది హన్సిక. 


దీనిపై ఆమె మాట్లాడుతూ.. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది తొమ్మిది చిత్రాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది తన కలలతో పాటు ప్రతి ఒక్కరి కలలు, కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నానని తెలిపింది. అందరూ ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా, విజయవంతంగా జీవించండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా, నిజాయితీగా నడుచుకోండి.. అని హన్సిక పిలుపునిచ్చింది.


Updated Date - 2022-01-07T03:10:06+05:30 IST