Gurthundaa Seethakalam : విడుదల తేదీ ఖరారు !

ABN , First Publish Date - 2022-08-16T23:16:32+05:30 IST

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev), మిల్కీ బ్యూటీ తమన్నా (Thamanna) తొలిసారి జంటగా నటిస్తున్న వైవిధ్య ప్రేమకథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthundaa Seethakalam). నాగశేఖర్ (Nagasekhar) దర్శకత్వంలో, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీవేదాక్షరా మూవీస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది.

Gurthundaa Seethakalam : విడుదల తేదీ ఖరారు !

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev), మిల్కీ బ్యూటీ తమన్నా (Thamanna) తొలిసారి జంటగా నటిస్తున్న వైవిధ్య ప్రేమకథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthundaa Seethakalam). నాగశేఖర్ (Nagasekhar) దర్శకత్వంలో, నాగశేఖర్  మూవీస్, మణికంఠ ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీవేదాక్షరా మూవీస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. మేఘా ఆకాశ్ (Megha Akash), కావ్యా శెట్టి  (Kavya Shetty), సుహాసిని మణిరత్నం (Suhasini Maniratnam) ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ ‘లవ్ మాక్‌టైల్’ (Love Mocktail) చిత్రానికిది అఫీషియల్ రీమేక్. ఇది వరకు విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 


నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పడు సాధ్యపడలేదు. ఆ తర్వాత జూన్ లోనూ, జూలైలోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ ఎట్టకేలకు సెప్టెంబర్ 9న రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. సత్యదేవ్ గత చిత్రం ‘గాడ్సే’ (Godse) థియేటర్స్‌లో అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం దీనికి మంచి ప్రజాదరణ దక్కింది.  ఈ సినిమాపై హీరో సత్యదేవ్, హీరోయిన్ తమన్నా మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఇద్దరి ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్టు నిర్మాతలు చెబుతున్నారు.   


ఒక ప్రమాదం నుంచి ఒకమ్మాయిని రక్షించిన హీరో.. ఆమెకి తన హైస్కూల్ లవ్ స్టోరీని, ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో అతడి ప్రేమ కథను వివరిస్తాడు.  ఆ తర్వాత కొత్తగా పరిచయం అయిన ఆ అమ్మాయితో అతడి జెర్నీ ఏంటన్నదే ఈ సినిమా కథాంశం. కన్నడలో డార్లింగ్ కృష్ణ (Darling Krishna), మిలనా నాగ్‌రాజ్ (Milana Nagaraj), అమృత అయ్యంగార్ (Amritha Ayyangar) జంటగా నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.  



Updated Date - 2022-08-16T23:16:32+05:30 IST