Karthikeya 2: ఆరంభం అదిరింది

ABN , First Publish Date - 2022-08-19T01:43:27+05:30 IST

నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రం.. తాజాగా థియేటర్లలో విడుదలై

Karthikeya 2: ఆరంభం అదిరింది

నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రం.. తాజాగా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రానికి రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. బాలీవుడ్, ఓవర్సీస్‌లలో సైతం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌తో చిత్రయూనిట్ కూడా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ సినిమాతో ఓ పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ కూడా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. 


వివరాల్లోకి వెళితే.. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించినప్పుడు.. నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని.. అన్ని భాషల అనువాదాలు ఏకకాలంలో హైదరాబాద్‌లో జరిగేటట్లుగా పోస్ట్ ప్రో (Post Pro) అనే కంపెనీని స్థాపించారు. వసంత్ (Vasanth) అనే అతను స్థాపించిన ఈ కంపెనీలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ (ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్) జరిగిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘కార్తికేయ 2’. ఆరంభ చిత్రమే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుండటంతో పోస్ట్ ప్రో రూపకర్త వసంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.


తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులను మరియు రచయితలను హైదరాబాద్‌కు రప్పించి నిర్మాతల సౌలభ్యం కోసం ‘కార్తికేయ 2’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను హైదరాబాద్‌లో పూర్తి చేసినట్లుగా ఈ సందర్భంగా వసంత్ తెలిపారు. దీనివల్ల నిర్మాతకు బడ్జెట్ కంట్రోల్‌లో ఉండడమే కాకుండా డైరెక్టర్ తన సినిమా అనువాద కార్యక్రమాలను.. ప్రతి రోజూ చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే వీలు ఉంటుందని, అలాగే చాలా సమయం ఆదా అవుతుందని పేర్కొంటూ.. ‘కార్తికేయ 2’ చిత్రాన్ని తమకు అప్పగించిన నిర్మాతలకి, దర్శకుడికి, హీరోకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థలో భారీ సినిమాలకు సంబంధించి అనువాద కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా ఆయన వెల్లడించారు.

Updated Date - 2022-08-19T01:43:27+05:30 IST