28న ‘The Legend‌’ గ్రాండ్‌ రిలీజ్‌..

ABN , First Publish Date - 2022-07-23T19:07:14+05:30 IST

న్యూ శరవణా స్టోర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరులో తొలిసారి నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్‌’ (The Legend‌). ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. లెజెండ్‌ శరవణన్‌ (saravanan) ను

28న ‘The Legend‌’ గ్రాండ్‌ రిలీజ్‌..

న్యూ శరవణా స్టోర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరులో తొలిసారి నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్‌’ (The Legend‌). ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. లెజెండ్‌ శరవణన్‌ (saravanan) ను తొలిసారి వెండితెర హీరోగా పరిచయం చేస్తూ దర్శకద్వయం జెడీ-జెర్రీ ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో  తెరెక్కించారు. హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఒక్క తమిళనాడులోనే దాదాపు 800కి పైగా స్ర్కీన్లలో, వరల్డ్‌వైడ్‌గా 2500 స్ర్కీన్లలో విడుదల చేస్తున్నారు. 


ఎమోషన్‌, యాక్షన్‌, ప్రేమ, కామెండీ, సెంటిమెంట్‌.. ఇలా అన్ని అంశాలను సమపాళ్ళతో జోడించి నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం భారీ సెట్‌ల నిర్మాణం, ఇతర ఖర్చుల కోసం రూ.60 కోట్ల మేరకు ఖర్చు చేయగా, ఒక్క విడుదల కోసమే రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. చెన్నై, కుంభకోణం, పొల్లాచ్చి, హిమాలయ పర్వతాలు తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపారు. హిందీ సినిమాలు, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ ద్వారా ఎంతో గుర్తింపుపొందిన ముంబై మోడల్‌ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) హీరోయిన్‌. 


ప్రముఖ హాస్య నటుడు దవంగత వివేక్‌ నటించిన చివరి చిత్రం ఇదే కావడం గమనార్హం. మరో హాస్య నటుడు యోగిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, విజయకుమార్‌, ప్రభు, నాజర్‌, సుమన్‌, తంబి రామయ్య, రోబో శంకర్‌, మైల్‌స్వామి, వంశీకృష్ణ, సింగంపులి, లొల్లుసభా మనోహర్‌, అముదవాణన్‌, కేపీవై యోగి, సెల్‌ మురుగన్‌, సచ్చు, పూర్ణిమ భాగ్యరాజ్‌, లత, దేవర్షిణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ‘సాదాసీదా కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన తెలివితేటులు, ప్రతిభ, కృషి, పట్టుదలతో తనకు ఎదురైన కష్టాలను జయించి ఏ విధంగా ‘ది లెజెండ్‌’గా అవతరించారన్నదే ఈ చిత్ర కథా సారాంశం. 

Updated Date - 2022-07-23T19:07:14+05:30 IST