Liger తో 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలా'..

ABN , First Publish Date - 2022-08-06T19:19:19+05:30 IST

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ (Liger).

Liger తో 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలా'..

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ  ‘లైగర్’ (Liger). ఆగస్టు 25న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఒకవైపు సింగిల్స్ రిలీజ్ చేస్తూనే మరో వైపు హీరో విజయ్ దేవరకొండ వెరైటీగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే లైగర్ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా 'ఆఫట్' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ని వదిలారు.  


ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే, లైగర్ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ అంచనాలు ఇంకా పిక్స్‌కి చేర్చేందుకు ఇప్పుడు స్వయంగా హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగారు. తాజాగా పాట్నాలో పాపులర్ అయిన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలా' బృందాన్ని కలిసి వారితో సరదాగా కాసేపు ముచ్చటించిన విజయ్, వారితో కలిసి టీ తాగి 'లైగర్' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. దీనికి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


కాగా, స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటిస్తోంది. రమ్య కృష్ణ, మైక్ టైసన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, కరణ్ జోహార్, చార్మి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు.



Updated Date - 2022-08-06T19:19:19+05:30 IST