Chiranjeevi: రక్తదాతలకు ‘చిరు భద్రత’

ABN , First Publish Date - 2022-09-04T21:11:24+05:30 IST

రక్తదాతలకు కానుకగా ‘చిరు భద్రత’ తమిళిసై చేతుల మీదుగా కార్డుల పంపిణీ రక్తపు చుక్క విలువేంటో నాకు తెలుసు చిరంజీవి మరెన్నో కార్యక్రమాలు చేయాలి - తెలంగాణ గవర్నర్‌ తమిళి సై

Chiranjeevi: రక్తదాతలకు ‘చిరు భద్రత’

రక్తదాతలకు కానుకగా ‘చిరు భద్రత’ (Chiru bhadratha)

తమిళిసై చేతుల మీదుగా కార్డుల పంపిణీ

రక్తపు చుక్క విలువేంటో నాకు తెలుసు

చిరంజీవి మరెన్నో కార్యక్రమాలు చేయాలి

- తెలంగాణ గవర్నర్‌ తమిళి సై (Tamilisai Soundararajan)


‘‘చిరంజీవి అభిమానులు ఆయనతో ఓ సెల్ఫీ తీసుకుని వెళ్లిపోయే టైప్‌ కాదు. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో  భాగమై వెనకుండి అడుగులు వేసే డెడికేషన్‌ ఉన్నవారు’’ అని తెలంగాణ గవర్నర్‌ డా. తమిళి సై అన్నారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి  ‘చిరు భద్రత’ పేరుతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్డులను అందజేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళి సై రక్తదాతలకు కార్డులను అందజేశారు. రాజ్‌భవన్‌ తరఫు రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఆమె చెప్పారు. అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్‌ను రూపొందించామని, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ కూడా అందులో భాగం కావాలని తమిళి సై కోరారు. (Tamilisai Inaugurated 'Chiru Bhadratha')


ఈ సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ ‘‘రక్తదానం చేయడం అంత సులభం కాదు. నేను హౌస్‌ సర్జన్‌గా ఉన్నప్పుడు రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని సందర్భాలను చూశాను. అప్పటి వరకూ ఐసీయులో చుట్టూ తిరిగిన కుటుంబ సభ్యులు పేషెంట్‌కి రక్తం కావాలని అడగగానే అడ్రస్‌ లేకుండా పారిపోయారు. రక్తదానం చేసిన వారిలో మళ్లీ కొత్త రక్తం వస్తుంది. ఎన్నో ఏళ్లగా చిరంజీవి ఈ  సేవలు అందిస్తునందుకు అభినందిస్తున్నా. అయితే నా అభినందనలు గవర్నర్‌గా కాదు ఒక డాక్టర్‌గా. ఎందుకంటే ఒక రక్తపు చుక్క విలువేంటో నాకు తెలుసు. 10 ఎంఎల్‌ బ్లడ్‌.. అప్పుడే పుట్టిన బిడ్డను రక్షిస్తుంది. సరైన సమయానికి బ్లడ్‌ అందక చనిపోయినవాళ్లను చూశా. 100 ఎంఎల్‌ బ్లడ్‌ దొరికి బతికిన వాళ్లను చూశా. అభిమానులు సినిమా చూసి విజిల్స్‌ వేయడం కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగం కావడం అభినందించదగ్గ విషయం’’ అని అన్నారు. 




చిరంజీవి మాట్లాడుతూ  ‘‘1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారు. ఆ ఘటన నన్ను ఎంతగానో బాధించింది. నా కోసం ఏదైనా చేేస అభిమానులు ఉన్నారు. వారి ప్రేమను నలుగురికి ఉపయోగపడేలా మార్చాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించాం. నా పిలుపు మేరకు వేలాది మంది అభిమానులు రక్తదానం చేశారు. అదొక ప్రవాహంలా కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది ప్రాణాలను కాపాడటానికి కారణమైన రక్త దాతలకు భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ‘చిరు భద్రత’ పేరుతో వారికి లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌తో వారికి భద్రత ఇవ్వాలనుకున్నా. ఆ కార్డులను గవర్నర్‌గారి చేతులమీదుగా అందజేయడం ఆనందంగా ఉంది. కరోనా సమయంలో సీసీసీ ద్వారా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం మొదటు పెట్టింది మొదలు, వాక్సినేషన్‌, ఆక్సిజన్‌ బ్యాంక్‌, ఇటీవల చిత్రపురి కాలనీలో ఆస్పత్రి ప్రకటన ఇలా ప్రతి విషయంలోనూ తమిళిసై గారి ప్రోత్సాహం ఉంది’’ అని చిరంజీవి తెలిపారు. ఇప్పటి వరకూ 9 లక్షల 30 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించామని దీనిలో 70 శాతం పేదలకు, మిగిలినవి ప్రైవేట్‌ ఆస్పత్రులకు అందజేశామని చిరంజీవి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య ఇప్పుడు చాలా తక్కువగా ఉందని చిరు అన్నారు. 





Updated Date - 2022-09-04T21:11:24+05:30 IST