యాక్షన్ డైరెక్టర్‌తో Gopichand ?

ABN , First Publish Date - 2022-07-04T16:02:15+05:30 IST

దక్షిణాదిన యాక్షన్ చిత్రాలు తీయడంలో తిరుగులేని దర్శకుడు హరి (Hari). ఇప్పటి వరకూ ఆయన తమిళంలో తీసిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలై.. మంచి సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా ‘సింగం’ (Singham) సిరీస్‌కు ఏ స్థాయిలో క్రేజ్ వచ్చిందో తెలిసిందే. తెలుగులోనూ ఆ సినిమాలన్నీ దుమ్మురేపేశాయి.

యాక్షన్ డైరెక్టర్‌తో Gopichand ?

దక్షిణాదిన యాక్షన్ చిత్రాలు తీయడంలో తిరుగులేని దర్శకుడు హరి (Hari). ఇప్పటి వరకూ ఆయన తమిళంలో తీసిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలై.. మంచి సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా ‘సింగం’ (Singham) సిరీస్‌కు ఏ స్థాయిలో క్రేజ్ వచ్చిందో తెలిసిందే. తెలుగులోనూ ఆ సినిమాలన్నీ దుమ్మురేపేశాయి. తాజాగా ఈ దర్శకుడు తీసిన ‘యానై’ (Yanai) చిత్రానికి తమిళనాట మంచి టాక్ వచ్చింది. తెలుగులో ‘ఏనుగు’  (Yenugu) పేరుతో విడుదలైంది. అరుణ్ విజయ్ (Arun Vijay) హీరోగా నటించిన ఈ సినిమా ఇక్కడ పర్వాలేదనిపించుకుంది. యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిపిన కథలతో బాక్సాఫీస్ వద్ద ఎన్నో విజయాలందుకున్న ఈ దర్శకుడి దృష్టి ఇప్పుడు టాలీవుడ్ హీరో గోపీచంద్‌ (Gopichand) పై పడిందని టాక్ వినిపిస్తోంది. 


ఎప్పటి నుంచో డైరెక్ట్ తెలుగు సినిమా తీయాలనుకుంటున్న హరి.. ఎట్టకేలకు గోపీచంద్‌తో ఓ సినిమాను ఖాయం చేసుకున్నాడని సమాచారం. నిజానికి హరి యంగ్ టైగర్ యన్టీఆర్‌ (NTR) కు ఒక కథ వినిపించాడట. దానికి యన్టీఆర్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. అయితే ప్రస్తుతం తారక్‌కు బోలెడన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అతడి డేట్స్ దొరకడానికే మూడేళ్ళ సమయం పడుతుంది. ఈ విషయమే యన్టీఆర్ హరికి చెప్పగా.. అదే కథను గోపీచంద్‌కు వినిపించి ప్రాజెక్ట్ ను ఖాయం చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే గోపీచంద్.. హరి లాంటి మాస్ యాక్షన్ దర్శకుడు అడిగితే కాదంటాడా? వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అతి త్వరలో గోపీచంద్, హరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. 


గోపీచంద్ ఇమేజ్ కు అనుగుణంగా హరి ఒక అదిరిపోయే కథాంశాన్ని రెడీ చేశాడట. హరి చిత్రాలకు హైలైట్‌గా నిలిచేవి యాక్షన్ సీక్వెన్సెసే. హీరోలకు హైఓల్టేజ్ ఎలివేషన్స్ ఇవ్వడంలో ఈ దర్శకుడు స్పెషలిస్ట్. దాంతో పాటు ఫ్యామిలీ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఆయన చిత్రాల్లో కామన్ గా ఉంటూంటాయి. అవన్నీ ఈ సినిమాలోనూ ప్రధానంగా ఉండబోతున్నట్టు టాక్. ఇటీవల పక్కా కమర్షియల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ (Srivaas) దర్వకత్వంలో ఓసినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయ్యాకా హరి దర్శకత్వంలోని సినిమాను ప్రారంభిస్తాడట. మరి వీరి కాంబో మూవీ ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి. 

Updated Date - 2022-07-04T16:02:15+05:30 IST