Neetho: నెమలై.. మనసే.. హరివిల్లు తాకిందే!

ABN , First Publish Date - 2022-10-04T18:51:46+05:30 IST

అభిరామ్ వర్మ (Aberaam Varma), సాత్వికా రాజ్ (Satvika Raj) జంటగా నటించిన ‘నీతో’ (Neetho) చిత్రంలోని ‘లలనా మధుర కలనా’ (Lalanaa Lyrical) లిరికల్ సాంగ్‌ను

Neetho: నెమలై.. మనసే.. హరివిల్లు తాకిందే!

అభిరామ్ వర్మ (Aberaam Varma), సాత్వికా రాజ్ (Satvika Raj) జంటగా నటించిన ‘నీతో’ (Neetho) చిత్రంలోని ‘లలనా మధుర కలనా’ (Lalanaa Lyrical) లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సింగర్ హరిహరన్ (Hariharan) ఈ పాటను ఆలపించారు. పృథ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై బాలు శర్మ (Balu Sharma) దర్శకత్వంలో ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా విడుదలైన చిత్ర ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ‘మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్  అయిందో  గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్  అవుతుందో గుర్తురాదు’ డైలాగ్‌కి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ (Vivek Sagar) సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట విషయానికి వస్తే..


‘‘నది మదిలో కడలిలా.. మేఘాన నది మెదిలే

సరాగం.. స్వరాణ్ణే.. వినే.. చోటే

ఆశై.. అదుపుదాటే.. తనువు తూలిందే 

ప్రేమంటే.. పేరాశే.. మెరిసే మినుకులా..

హే.. తెలియని తారా తీరం

జతపడే మాయాజాలం

పరవశం కమ్మిందేమో.. ఈ నీలాకాశం

లలనా.. మధుర కలనా.. ఏహే.. కనులు దాటే.. చినుకు వేగం

హే.. హే.. హే లలనా.. ఉరికే ఎదలో ఉరిమే మౌనం 

మేఘం.. మోహం తెలిపే తపమే వరుణం

తెలిపే తపమే.. తపనేదో రేపిందే..

నెమలై.. మనసే.. హరివిల్లు తాకిందే!’’ వంటి సాహిత్యంతో మంచి పొయిటిక్ ఫీల్‌ను కలిగిస్తోందీ పాట. వరుణ్ వంశీ బి ఈ పాటకు సాహిత్యం అందించారు. హరిహరన్ వాయిస్‌లో ఈ పాట వినసొంపుగా ఉంది. ప్రస్తుతం ఈ పాట మంచి స్పందనను రాబట్టుకుంటోంది. కాగా, చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. 



Updated Date - 2022-10-04T18:51:46+05:30 IST