Abhiram: సైదులో సైదులా.. ఈ నాటు పోరగాన్నే!

ABN , First Publish Date - 2022-10-06T06:59:30+05:30 IST

లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యష్ రాజ్, నవిమి గాయక్ (‘నాంది’ సినిమా ఫేమ్) జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం ‘అభిరామ్’. అన్ని కార్యక్రమాలు..

Abhiram: సైదులో సైదులా.. ఈ నాటు పోరగాన్నే!

లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యష్ రాజ్, నవిమి గాయక్ (‘నాంది’ సినిమా ఫేమ్) జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం ‘అభిరామ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధంగా ఉన్న ఈ సినిమాలోని ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల - ఓ సైదులో సైదులా నా గుండె గుంజు కెళ్లే’ లిరికల్ సాంగ్‌కు మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు వస్తున్న స్పందనతో నిర్మాత సంతోషం వ్యక్తం చేస్తూ.. పాటని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అలాగే దసరా శుభాకాంక్షలు తెలిపారు. పాటను విడుదల చేసిన టిప్స్ మ్యూజిక్ వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. పాట విషయానికి వస్తే..


‘‘చుట్టు చుట్టు పట్టి చీరను కట్టి -

చుట్ట కట్టి గుండె కొంగున చుట్టి,

కట్ట కట్టి నిన్ను బుట్టలో పెట్టే అగ్గి పెట్టె ..అగ్గే పెట్టే

అట్ట ఇట్ట చూసి కన్నే కొట్టి -

చిట్టి గుండె చుట్టూ దారం చుట్టి

పట్టుబట్టి ప్రేమ ముగ్గులో నెట్టే.. పిల్ల..గా..డ, అల్లా రో..డా..

హే సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల -

ఓ సైదులో సైదులా నా గుండె గుంజు కెళ్లే

సైదులో సైదులా..ఈ నాటు పోరగాన్నే -

సైదులో సైదులా నట్టేట ముంచే టోళ్లే’’ అంటూ సాగిన ఈ పాట యూత్‌లో హుషారును నింపుతోంది. ఈ పాటకు సాగర్ నారాయణ సాహిత్యం అందించగా.. మీనాక్షి భుజంగ్ స్వరపరిచారు. ఉమా నేహా, సింహ ఆలపించారు. డ్యాన్స్ మాస్టర్ చంద్ర కిరణ్ కొరియోగ్రఫీ చేశారు. కాగా, లవ్ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ కలయికతో ఒక వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని.. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు.



Updated Date - 2022-10-06T06:59:30+05:30 IST