Chiranjeevi: ఇది కదా.. మెగాభిమానులకి కిక్ ఇచ్చే న్యూస్!

ABN , First Publish Date - 2022-06-05T01:22:09+05:30 IST

‘ఆచార్య’ (Acharya) సినిమాతో పరాజయం చవిచూసిన మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), ఆ తప్పు మరోసారి రిపీట్ కాకూడదని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే

Chiranjeevi: ఇది కదా.. మెగాభిమానులకి కిక్ ఇచ్చే న్యూస్!

‘ఆచార్య’ (Acharya) సినిమాతో పరాజయం చవిచూసిన మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), ఆ తప్పు మరోసారి రిపీట్ కాకూడదని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఓకే చేసిన ప్రాజెక్ట్స్‌ని కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారట. ఒక యంగ్ డైరెక్టర్‌తో కమిట్ అయిన సినిమాని కూడా చిరు ఆపేశారని, ఆ ప్లేస్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)తో ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

వరుసగా సీరియస్ రోల్స్‌లో దర్శనమివ్వబోతున్న చిరు(Chiru)కి వెనువెంటనే ఒక హిట్ కూడా కావాలి. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్‌తో సినిమా చేస్తే వింటేజ్ చిరుని అభిమానులకి గుర్తుకి తెచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే.. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి మెగాస్టార్ రెడీ అయ్యారట. చిరులోని కామెడీ యాంగిల్‌ని ఫుల్ లెంగ్త్‌లో చూపిస్తూ, అవుట్ అండ్ అవుట్ కామెడీ పాత్రలో చిరుని త్రివిక్రమ్ చూపించనున్నారట. 


నిజానికి చిరు-త్రివిక్రమ్ (Chiru-Trivikram) కాంబినేషన్ సెట్టవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చిరు నటించిన ‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva).. సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. ఈ మూవీలో చిరు వేసిన పంచ్ లైన్స్ అండ్ కామెడీ సీన్స్ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేశాయి. ఈ నేపథ్యంలో.. చిరుతో త్రివిక్రమ్ ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్ చేస్తే ఎలా ఉంటుందో ఇంక చెప్పనవసరం లేదనుకుంటా.

Updated Date - 2022-06-05T01:22:09+05:30 IST