Godfather : రిలీజ్ అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-06-20T13:53:57+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్’ (Godfather) ఒకటి. తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) తెరకెక్కిస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ .. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) కు అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

Godfather : రిలీజ్ అప్పుడేనా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్’ (Godfather) ఒకటి. తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) తెరకెక్కిస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) కు అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, చిరు ఇమేజ్‌కు అనుగుణంగా ఒరిజినల్ వెర్షన్ కథాంశంలో స్పల్ప మార్పులు చేశారు. నయనతార (Nayanathara), సత్యదేవ్ (Satyadev) కీలకపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ (Salmankhan) ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. చిరంజీవికి కుడిభుజం లాంటి ఆ పాత్రను ఒరిజినల్ వెర్షన్‌లో పృధ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) చేశాడు. మెయిన్ విలన్‌గా జగపతిబాబు (Jagapathibabu) నటిస్తున్నారని తెలుస్తోంది. ఇంకా ఇందులో గంగవ్వ, పూరీ జగన్నాథ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.


షూటింగ్ చివరిదశకు చేరిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం ఎప్పుడు విడులవుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘ఆచార్య’ (Acharya) చిత్రం పరాజయం పాలైన నేపథ్యంలో నిరాశ చెందిన అభిమానులు ‘గాడ్‌ఫాదర్’ మూవీ కచ్చితంగా అంచనాల్ని అందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకూ ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదలవుతుందనే వార్తలు వినిపించాయి. అయితే ఆగస్ట్‌లో కానీ, సెప్టెంబర్‌లో కానీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇటీవల ఒక కార్యక్రమంలో చిరంజీవే స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ నీరవ్ షా (Neerav shah). మురళీగోపి (Muraligopi) కథకు మోహన్ రాజా స్ర్కీన్ ప్లే జతకానుంది. మరి ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. 

Updated Date - 2022-06-20T13:53:57+05:30 IST