గాడ్‌ ఫాదర్‌ ట్రైలర్‌ సిద్ధం

ABN , First Publish Date - 2022-09-27T06:12:43+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించారు....

గాడ్‌ ఫాదర్‌ ట్రైలర్‌ సిద్ధం

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించారు. నయనతార కథానాయిక. మోహన్‌ రాజా దర్శకుడు. అక్టోబరు 5న విడుదల కానుంది. ఈనెల 28న అనంతపురంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతోంది. ఈ సందర్భంగా థియేట్రికల్‌ ట్రైలర్‌ని ఆవిష్కరించబోతున్నారు. త్వరలోనే ముంబైలోనూ ఓ ఈవెంట్‌ నిర్వహిస్తారని సమాచారం. సల్మాన్‌ ఖాన్‌ ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారని తెలుస్తోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసీఫర్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ‘‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ అనే డైలాగ్‌ ఇటీవల బాగా పాపులర్‌ అయ్యింది. ఈ డైలాగ్‌ ఈ ట్రైలర్‌లో వినిపించే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ భూపాల ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. తమన్‌ స్వరకర్త. 


Updated Date - 2022-09-27T06:12:43+05:30 IST