Godfather box office: గాడ్ ఫాదర్ రెండో రోజు కలెక్షన్స్ బాగున్నాయి

ABN , First Publish Date - 2022-10-07T19:45:11+05:30 IST

చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన గాడ్ ఫాదర్ (Godfather) సినిమా కలెక్షన్స్ రెండో రోజు (Second Day collections) బాగున్నాయి.

Godfather box office: గాడ్ ఫాదర్ రెండో రోజు కలెక్షన్స్ బాగున్నాయి

చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన గాడ్ ఫాదర్ (Godfather) సినిమా కలెక్షన్స్ రెండో రోజు (Second Day collections) బాగున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సుమారు 13 కోట్లవరకు షేర్ కలెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ రెండో రోజు మరో 7.5 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ చెప్తున్నారు. రెండు రోజులకు కలిపి మొత్తం సుమారుగా 20.5 కోట్లు కలెక్ట్ చేసిందని, ఇది శుభ పరిణామం అని చెప్తున్నారు. ఇలాగె కనుక ఈ వీకెండ్ వరకు కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అయ్యే అవకాశం వుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. మోహన్ రాజా (Director Mohan Raja) దర్శకత్వం వహించిన ఈ 'గాడ్ ఫాదర్' మలయాళం సినిమా 'లూసిఫెర్' (Lucifer) కి రీమేక్. తెలుగు లో సత్యదేవ్ (Satyadev) మలయాళం లో చేసిన వివేక్ ఒబెరాయ్ పాత్ర అద్భుతంగా పోషించాడు, అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఒక చిన్న అతిధి పాత్రలో కనిపిస్తాడు.

ఇంకా ఓవర్ సీస్, కర్ణాటక, హిందీ, రెస్ట్ అఫ్ ఇండియా కానక చూసుకుంటే అవన్నీ కలిపి సుమారు 7 కోట్లు వసూలు  చేసినట్టుగా తెలుస్తోంది. రెండో రోజుల్లో మొత్తం అల్ ఓవర్ ది వరల్డ్ కలెక్షన్స్ చూసుకుంటే, 'గాడ్ ఫాదర్' సుమారుగా 27.5 కోట్లు కలెక్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది కానక ఇలాగె కొనసాగి వచ్చే శని, ఆది వారాలు సెలవు రోజుల్లో బాగా కలెక్షన్ కానక వస్తే, సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ట్రాండ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. ఈ సినిమాకి సుమారు 90 కోట్లు బడ్జెట్ అయినట్టుగా చెపుతున్నారు. అలాగే ఇప్పుడు కలెక్షన్స్ కూడా 90 కోట్లు దాటి వస్తేనే హిట్ కింద లెక్క. మామూలుగా అయితే ఈ సినిమా శాటిలైట్, ఓ టి టి హక్కులు సుమారుగా 67 కోట్లకు విడుదలకు ముందే అమ్మేసారు. అందుకని ఈ సినిమా 40 నుంచి 50 కోట్ల వరకు ధియేటరికల్ వ్యాపారం చేసిన నిర్మాతలకి ఇది ఒక లాభసాటి అయిన సినిమా అవుతుందని, ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా వుంటాయో చూడాలి. 

Updated Date - 2022-10-07T19:45:11+05:30 IST