GodFather: పాత ఘటనను గుర్తు చేసుకుని.. సౌత్, నార్త్‌ల మధ్య విభజన గురించి చెప్పిన చిరు..

ABN , First Publish Date - 2022-10-02T20:57:16+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన సినిమా ‘గాడ్‌ఫాదర్’ (GodFather). నయనతార, సత్య దేవ్, సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలు పోషించారు.

GodFather: పాత ఘటనను గుర్తు చేసుకుని.. సౌత్, నార్త్‌ల మధ్య విభజన గురించి చెప్పిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన సినిమా ‘గాడ్‌ఫాదర్’ (GodFather). నయనతార, సత్య దేవ్, సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. తాజాగా ముంబైలో హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ లాంచ్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడాడు. సౌత్, నార్త్‌ల మధ్య విభజన ఏ విధంగా ఉండేదో చెప్పాడు. 1985నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.      


భారతీయ సినిమాలన్నింటిని ఎల్లప్పుడు ఒకే ఇండస్ట్రీగా చూడాలనుకున్నానని మెగాస్టార్ చెప్పాడు. గతంలో చోటు చేసుకున్న ఘటనను వివరించాడు. ‘‘రుద్రవీణ సినిమాకు 1985లో నర్గీస్ దత్ అవార్డు వచ్చింది. నిర్మాతల తరఫున అవార్డును తీసుకోవడానికి నేను వెళ్లాను. ఓ ప్రదేశంలో భారతీయ సినిమాల చరిత్ర అంటూ కొన్ని ఫొటోలు ఉంటారు. రాజ్ కుమార్, దిలీప్ కుమార్ ఇతర దిగ్గజ నటుల ఫొటోలను చూశాను. కానీ, సౌత్‌కు చెందిన నటుల చిత్రాలను కొన్నింటిని మాత్రమే అక్కడ ఉంచారు. రాజ్ కుమార్, ఎన్‌టీఆర్ వంటి లెజెండరీ నటులు ఎంతో మంది దక్షిణాదిలో ఉన్నారు. వారి పిక్స్ మాత్రం కనిపించలేదు. శివాజీ గణేశన్ అద్భుతమైన నటుడు అతడి ఫొటో కూడా లేదు. దీంతో కొంచెం బాధగా అనిపించింది. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడేనా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మంచి నటులు లేరా. దక్షిణాదికి చెందిన నటులు కూడా గొప్పవారే. ప్రస్తుతం రోజులు మారాయి. దక్షిణాది సినిమాల గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లో రామ్ చరణ్‌కు ఘనస్వాగతం లభించింది. ప్రేక్షకులు ఆద్భుతంగా ఆదరించారు. తండ్రిగా ఆ స్వాగతం నాకు అభించలేదు. నా కల రామ్ చరణ్ ద్వారా నేరవేరినందుకు నేను సంతోషిస్తున్నాను. నిజం చెప్పాలంటే గర్విస్తున్నాను’’ అని చిరంజీవి చెప్పాడు.          


మాలీవుడ్‌లో హిట్ అయిన సినిమా ‘లూసిఫర్’ (Lucifer). తెలుగులో ‘గాడ్‌ఫాదర్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్లూ భాయ్ అతిథి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీ భారీ స్థాయిలో బిజినెస్ చేసింది. థియేట్రీకల్, ఓటీటీ, ఆడియా రైట్స్ ద్వారా రూ.200కోట్లు లభించాయని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

Updated Date - 2022-10-02T20:57:16+05:30 IST