Poor first day Godfather: మొదటి రోజు కలెక్షన్స్ లో గాడ్ ఫాదర్ ఎన్నో స్థానం లో ఉందంటే...

ABN , First Publish Date - 2022-10-06T17:47:55+05:30 IST

చిరంజీవి (Mega Star Chiranjeevi) రాజకీయాలకు (political party) వెళ్లేముందు అంటే 2007 లో 'శంకర్ దాదా జిందాబాద్' (Shankar Dada Zindabad) సినిమా చేసాడు. ఆ తరువాత అతను రాజకీయాల్లో తలమునకలయి సినిమాలకు దూరం అయ్యారు.

Poor first day Godfather: మొదటి రోజు కలెక్షన్స్ లో  గాడ్ ఫాదర్ ఎన్నో స్థానం లో ఉందంటే...

చిరంజీవి (Mega Star Chiranjeevi) రాజకీయాలకు (political party) వెళ్లేముందు అంటే 2007 లో 'శంకర్ దాదా  జిందాబాద్' (Shankar Dada Zindabad) సినిమా చేసాడు. ఆ తరువాత అతను రాజకీయాల్లో తలమునకలయి సినిమాలకు దూరం అయ్యారు. మధ్యలో రెండు మూడు సినిమాల్లో కొన్ని నిముషాలపాటు కనిపించినా, రాజకీయాలను వదిలేసి మళ్ళీ ఒక పెద్ద సినిమా 'ఖైదీ నెంబర్ 150' (Khaidi No.150) సినిమాతో, తన 150 వ సినిమాగా వచ్చారు. ఆ సినిమా చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రావటం, ఎలా వుండబోతోంది అన్న ఆసక్తితో బాగా చూసారు కూడా. అది తమిళ్ సినిమా 'కత్తి' కి రీమేక్. 

ఇలా మళ్ళీ వచ్చి చేసిన సినిమా 'ఖైదీ నెంబర్ 150' రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 23.30 కోట్ల రూపాయలు షేర్ మొదటి రోజు కలెక్ట్ చేసింది. ఆ తరువాత వచ్చిన 'సైరా నరసింహ రెడ్డి' (Sye Raa Narasimha Reddy)  కూడా బాగానే కలెక్ట్ చేసింది. మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో సుమారు 36.67 కోట్లు కలెక్ట్ చెయ్యగా, ప్లాప్ అని చిరంజీవి అభిమానులే స్వయంగా చెప్పిన 'ఆచార్య' (Acharya) మొదటి రోజు (First day) రెండు రాష్ట్రాల్లో సుమారు 26 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే 'ఆచార్య' నైజాం (Nizam) లో సుమారుగా 7.9 కోట్లు మొదటి రోజు కలెక్ట్ చేసింది. వీటన్నిటి బట్టి ఇప్పుడు విడుదల అయిన 'గాడ్ ఫాదర్' (Godfather) రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 13 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ (Blockbuster) అంటున్నారు. మొత్తం మొదటి రోజు అత్యధిక కలక్షన్స్ చేసిన సినిమాల లిస్ట్ చూసుకుంటే చిరంజీవి 'సైరా నరసింహ రెడ్డి' మూడో స్థానం (Third place) లో వుంది. ప్లాప్ అని చెప్పబడుతున్న 'ఆచార్య' సినిమా టాప్ టెన్ (Top Ten) లో వుంది. ఇవన్నీ మొదటి రోజు కలెక్షన్స్ మాత్రమే! మరి మెగా స్టార్ చిరంజీవి సినిమా విడుదల మొదటి రోజు కలెక్షన్స్ 13 కోట్లు వస్తే సంబరపడిపోతున్నారు!


రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక కలక్షన్స్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే (ఇవన్నీ సుమారుగా) 


1. ట్రిపుల్ ఆర్ (ఆర్ ఆర్ ఆర్) 73.99 కోట్లు 

2. బాహుబలి 42.74 కోట్లు 

3. సైరా నరసింహ రెడ్డి 36.67 కోట్లు 

4. సర్కారు వారి పాట 36.29 కోట్లు 

5. సాహో 36 కోట్లు 


పై వాటిని బట్టి ఇప్పుడు విడుదల అయినా 'గాడ్ ఫాదర్' ఎన్నో స్థానం లో ఉందొ మనం ఊహించుకోవచ్చు.

Updated Date - 2022-10-06T17:47:55+05:30 IST