గాడ్‌ ఫాదర్‌ ఆగయా!

ABN , First Publish Date - 2022-07-05T05:55:14+05:30 IST

మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది...

గాడ్‌ ఫాదర్‌ ఆగయా!

మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. చిరంజీవి తొలిసారిగా సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో, బ్లాక్‌ షేడ్స్‌ ధరించి, కుర్చీలో కూర్చున్న ఫస్ట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌ వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది.  ఒక కార్యాలయం బయట వేలాది మంది పార్టీ కార్యకర్తలు వేచి ఉండగా, మెగాస్టార్‌ చిరంజీవి అక్కడికి  కారులో రావడం, సునీల్‌ డోర్‌ తీయగా చిరంజీవి కారు దిగి , విలాసంగా ఆఫీసులోకి నడుచుకుంటూ రావడం అందరినీ ఆకట్టుకుంది.  భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ ఏడాది విజయదశమికి ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.


Updated Date - 2022-07-05T05:55:14+05:30 IST