God Father -Lakshmi Bhupala: నీకు అంత సీన్‌ ఉందా అన్నారు

ABN , First Publish Date - 2022-10-04T23:36:00+05:30 IST

‘‘చిరంజీవిగారు రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు చేసిన సినిమాలో నేను రాసిన ‘ఒక్క మాట ఆయన నోట వస్తే చాలనుకున్నా. ఎందుకంటే మళ్లీ ఆయన సినిమాల్లోకి వస్తారో రారో’ అన్న భయం. అప్పుడు నాగబాబుగారికి కాల్‌ చేసి అడిగా. అప్పుడు కుదరలేదు.

God Father -Lakshmi Bhupala: నీకు అంత సీన్‌ ఉందా అన్నారు

‘‘చిరంజీవి(Chiranjeevi)గారు రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు చేసిన సినిమాలో నేను రాసిన ‘ఒక్క మాట ఆయన నోట   వస్తే చాలనుకున్నా. ఎందుకంటే మళ్లీ ఆయన సినిమాల్లోకి వస్తారో రారో’ అన్న భయం. అప్పుడు నాగబాబుగారికి కాల్‌ చేసి అడిగా. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు రెండున్నర గంటలు నా మాటల్ని ఆయన నోట పలికారు. ఇది అదృష్టమా.. వరమా.. ఏమనాలో కూడా తెలియట్లేదు’’ అని చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని(Fan moment) చెప్పుకొచ్చారు మాటల రచయిత లక్ష్మీ భూపాల. మెకానిక్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన మెగాస్టార్‌కి మాటలు రాసే స్థాయికి ఎదిగారు. చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ (god father) చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో (Fan boy)లక్ష్మీభూపాల మాట్లాడారు. 


‘‘మాది ఏలూరు. ఓ ఫంక్షన్‌ నిమిత్తం చిరంజీవి అక్కడికి వచ్చారు. ఆయన రాకతో రోడ్లన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. నేనేమో చిన్నవాడిని. సరిగా చూడలేకపోయా. ఇంటికి వెళ్లగానే ‘చిరంజీవిని చూశావా అని అమ్మమ్మ అడిగింది’ లేదమ్మా.. బాగోదని నేనే వెళ్లలేదు... భవిష్యత్తులో ఆయనతో పని చేయాల్సిన వాడిని. ఇప్పుడే వెళ్తే.. అప్పుడే వచ్చేశావేంటని ఆయన తిడతారేమో’ అని వెనక్కి వచ్చేశానని చెప్పాను. ఇది అతిశయోక్తి కాదు. నిజంగా జరిగింది. ఈ విషయం నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ తెలుసు. ఆ రోజు అమ్మమ్మకు చెప్పిన ఓ అబద్ధమైన కల.. ఈ రోజు నిజమై చిరంజీవి అనే డెమీగాడ్‌ ముందు నిలబడ్డాను. ‘చూడాలనివుంది’ సినిమా 50 రోజుల దాటిన తర్వాత టోకన్‌ ఆఫ్‌ లవ్‌ పేరుతో ఆడియన్స్‌కి గిఫ్ట్‌గా ఓ పాటను విడుదల చేశారు. ఆ సమయంలో అన్నపూర్ణలో జరిగిన వేడుకలో చిరంజీవిగారి చుట్టూ ఉన్నది నేనే. ఆ పాటకు ఆడియన్స్‌ స్పందన తీసుకుని ఆ లిస్ట్‌ అంతా చిరంజీవి గారి ముందు ఉంచాను. ఆ తర్వాత ఆయన్ను ఓ ప్రశ్న అడిగాను. దాన్ని కట్‌ చేసి ప్రోమోగా విడుదల చేస్తే.. ఎవరు నమ్మలేదు. చిరంజీవిగారి దగ్గరికి వెళ్లి మాట్లాడేంత సీన్‌ నీకుందా? అది ఫేక్‌ వీడియో అని కామెంట్స్‌ చేశారు. అది నిజం అని ఈ రోజు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఎన్నో దాటుకుని ఇక్కడికి వచ్చాను. చిన్నప్పటి నుంచి నేను ఏ ఆర్టిస్ట్‌ని అభిమానిని కాదు. గ్రేట్‌ పెర్‌పార్మర్‌ అంటే నాకు పిచ్చి. ‘పున్నమినాగు, ‘రుద్రవీణ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ వంటి చిత్రాలు చూసి మెస్మరైజ్‌ అయిపోయాను. ‘గాడ్‌ఫాదర్‌’ షూటింగ్‌లో చిరంజీవిగారున్న ప్రతి రోజు నేను సెట్‌లో ఉన్నా. నేను రాసిన మాటలు ఆయన నోట పలుకుతుంటే ఎలా ఉంటుందో అన్న ఆతురతతో ఆడియన్స్‌ కంటే ముందే నేనే చూడాలని సెట్‌లో ఉండేవాడిని. ‘లూసిఫర్‌’ రీమేక్‌ చిరంజీవిగారు చేస్తున్నారని తెలిసి... సీనియర్‌ రైటర్‌ సత్యానంద్‌గారిని కలిసి ‘బాస్‌ రేంజ్‌ ఏంటి.. ఈ కథ ఎంచుకోవడం ఏంటి’ అని మాట్లాడాను. ఈ సినిమాకు రైటర్‌ని అని తెలిసి కూడా అదే ఆలోచనలో ఉన్నా. ‘అత్తయముడు అమ్మాయికి మొగుడు’, ‘దొంగమొగుడు’ తరహాలో పంచ్‌లు, మేనరిజం ఉండే చిత్రాలు కదా రాయాలి. ఇది వచ్చిందేంటి అనుకున్నా. ఫైనల్‌గా బాస్‌ సినిమా అవకాశం వచ్చింది చాలనుకున్నా. నా మాటలకి ఆయన ‘ఆ.. ఊ’ అన్న చాలనుకున్నా. దాని కన్నా ముందు.. ఆయన పార్టీలోకి వెళ్లడానికి ముందు చేసిన సినిమాకి ‘ఒక్క మాట మీ నోట వస్తే చాలు.. మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి వస్తారో రారో’ అని నాగబాబుగారికి కాల్‌ చేసి అడిగా. ఇప్పుడు రెండున్నర గంటలు నా మాటల్ని ఆయన నోట పలికారు. ఇది అదృష్టమా.. వరమా.. ఏమనాలో కూడా తెలియట్లేదు. ఇవన్నీ చిరంజీవిగారు ఒక్కరే ఉన్నప్పుడు మాట్లాడలేను. ఇప్పుడు ఆయన ముందు మాట్లాడాలంటే టెన్షన్‌గా ఉంది. అబ్బ డబ్బ జబ్బా అన్నట్టు నా పరిస్థితి ఉంది’’ అని చెప్పుకొచ్చారు. 




Updated Date - 2022-10-04T23:36:00+05:30 IST