Ghost turns disaster: ఘోస్ట్ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి

ABN , First Publish Date - 2022-10-07T17:22:15+05:30 IST

నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన యాక్షన్ సినిమా 'ఘోస్ట్' (Ghost) కలెక్షన్స్ రెండో రోజు బాగా పడిపోయాయి (drastically dropped the collections on second day).

Ghost turns disaster: ఘోస్ట్ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి

నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన యాక్షన్ సినిమా 'ఘోస్ట్' (Ghost) కలెక్షన్స్ రెండో రోజు బాగా పడిపోయాయి (drastically dropped the collections on second day). ఈ సినిమా ఇప్పుడు నడవాలంటే ఎదో విచిత్రం (miracle) జరిగి అమాంతం బాక్స్ ఆఫీస్ (Box Office) దగ్గర కలెక్షన్స్ పెరిగితే సినిమా నిలబడుతుంది. లేదా డిసాస్టర్ (disaster) అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వున్నాయి. ఈ సినిమా మొదటి రోజు సుమారు 2 కోట్ల (First day collected 2 crore) రూపాయలు కలెక్ట్ చేస్తే, రెండో రోజు వచ్చేసరికి 76 లక్షలు (Second day only 76 lakhs) మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద నాగార్జున చాలా అసలు పెట్టుకున్నాడు. చాల ప్రమోట్ కూడా చేసాడు సినిమాని, అయినా సినిమాలో విషయం లేకపోవటం వల్ల రెండో రోజు కలెక్షన్స్ బాగా పడిపోయాయి. దసరా పండగ రోజు విడుదల అవటం వలన, మొదటి రోజు కలెక్షన్స్ అయినా వచ్చాయి, లేకపోతే ఈ సినిమా మొదటి రోజే డిసాస్టర్ అని చెప్పేసేవారు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.


'ఘోస్ట్' సినిమా లో పోరాట సన్నివేశాల్లో బాగా హింస ఉండటం (Too much violence) వలన ఈ సినిమాకి కుటుంబ ప్రేక్షకులు (Family audience) చాలా దూరం అయ్యారు. అలాగే ఈ సినిమాలో తెలుగు నటులు ఎక్కువ లేకపోవటం వలన కూడా ఈ సినిమాకి అంత ఆదరణ లభించలేదు అన్నది రెండో కారణం. 

మొదటి రోజు: 2 కోట్లు (సుమారుగా)

రెండో రోజు: నైజాం 24 లక్షలు 

సీడెడ్ 13 లక్షలు 

ఉత్తరాంధ్ర 16 లక్షలు 

ఈస్ట్ : 5 లక్షలు 

వెస్ట్: 4 లక్షలు 

గుంటూరు : 6 లక్షలు 

కృష్ణ: 5 లక్షలు 

నెల్లూరు 3 లక్షలు 

టోటల్ 76 లక్షలు 

రెండు రోజుల మొత్తం: 2.76 కోట్ల రూపాయలు. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వచ్చినవి. 

Updated Date - 2022-10-07T17:22:15+05:30 IST