Ranbir Kapoor ని ‘ఆమె’ ‘Get Lost!’ అని తిట్టింది... ఇంతకీ, తనతో రణబీర్ ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2022-04-08T02:15:35+05:30 IST

మనకు ఇక్కడ డార్లింగ్స్ అయిన బాలీవుడ్ సెలబ్రిటీలు డాలర్ల దేశంలో డమ్మీలు మాత్రమే. ఇలా అనటం మన సినీ ప్రముఖుల్ని అవమానించటానికి కాదు. కాకపోతే, ఇండియాలో ఎంత క్రేజ్ ఉన్నా ఇతర దేశాల్లో మన హీరోలు, హీరోయిన్స్ మామూలు విజిటర్స్ మాత్రమే! ఇందుకు... బీ-టౌన్ అందగాడు రణబీర్ కూడా మినహాయింపు కాదు...

Ranbir Kapoor ని ‘ఆమె’ ‘Get Lost!’ అని తిట్టింది... ఇంతకీ, తనతో రణబీర్ ఏం చేశాడంటే...

భారతదేశంలో రెండు వేల రూపాయల నోటుకి చాలా విలువ ఉంటుంది. అదే నోటు తీసుకెళ్లి అమెరికాలో చూపిస్తే... ఎవ్వరూ తీసుకోరు! అక్కడ మన కరెన్సీ నోటు కేవలం కాగితం ముక్క మాత్రమే! ఇప్పుడు ఈ పోలిక ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... మనకు ఇక్కడ డార్లింగ్స్ అయిన బాలీవుడ్ సెలబ్రిటీలు డాలర్ల దేశంలో డమ్మీలు మాత్రమే. ఇలా అనటం మన సినీ ప్రముఖుల్ని అవమానించటానికి కాదు. కాకపోతే, ఇండియాలో ఎంత క్రేజ్ ఉన్నా ఇతర దేశాల్లో మన హీరోలు, హీరోయిన్స్ మామూలు విజిటర్స్ మాత్రమే! ఇందుకు... బీ-టౌన్ అందగాడు రణబీర్ కూడా మినహాయింపు కాదు... 


రణబీర్ కపూర్ ఓ సారి కపిల్ శర్మ షోలో పాల్గొన్నప్పుడు హాలీవుడ్ స్టార్ నటాలీ పోర్ట్ మాన్ గురించి చెప్పుకొచ్చాడు. ఆమెకి మన వాడు వీరాభిమాని! మరి తన ఫేవరెట్ యాక్ట్రస్ న్యూ యార్క్ వీధుల్లో ప్రత్యక్షంగా కనిపిస్తే మనసు ఆగుతుందా చెప్పండి? వెంటనే తన వద్దకి పరుగెత్తుకెళ్లి ‘‘ఒక ఫోటో ప్లీజ్’’ అంటూ రిక్వెస్ట్ చేశాడట. కానీ, ఆ క్షణంలో ఆస్కార్ అవార్డ్ విన్నర్ నటాలీ పోర్ట్ మాన్ ఏదో వ్యక్తిగత కారణం చేత కంటతడి పెట్టుకుంటోందట! ఆ విషయం రణబీర్ కి అర్థమయ్యేలోగానే ‘ఫోటో’ కావాలంటూ అడిగేశాడు. దాంతో ఆమె ‘గెట్ లాస్ట్’ అంటూ తీవ్రంగా మందలించిందట. 


తన అభిమాన నటి చేత చీవాట్లు తిన్నప్పటికీ ఆమె మీద ఇష్టం ఎంత మాత్రం తగ్గలేదని కూడా కపిల్ శర్మ షోలో చెప్పాడు రణబీర్. మరోసారి ఆమె తనకు ఎదురైతే... ఏ మాత్రం సంకోచం లేకుండా ‘ఫోటో ప్లీజ్’ అంటానని తెలిపాడు!   

Updated Date - 2022-04-08T02:15:35+05:30 IST