దీపిక సినిమాలో ఆ బూతు పదాన్ని ఎందుకు వాడారంటూ ట్రోల్.. రైటర్ తండ్రి ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-02-16T18:22:34+05:30 IST

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే నటించిన తాజా చిత్రం ‘గెహ్రాయాన్’. ఇటీవలే అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది...

దీపిక సినిమాలో ఆ బూతు పదాన్ని ఎందుకు వాడారంటూ ట్రోల్.. రైటర్ తండ్రి ఏమన్నాడంటే..

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే నటించిన తాజా చిత్రం ‘గెహ్రాయాన్’. ఇటీవలే అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ బూతు పదం ఎక్కువగా మాట్లాడతారు. దీంతో దీనిపై చాలామంది నెటిజన్లు ట్రోల్ చేశారు.


ఈ ట్రోలింగ్‌పై సినిమా నటులు, డైరెక్టర్ కానీ స్పందించలేదు. అయితే ఈ మూవీ రైటర్ సుమిత్ రాయ్ తండ్రి చందన్ రాయ్ ట్రోలర్స్‌కి రిప్లై ఇచ్చారు. అందులో ఓ నెటిజన్.. ‘నాకో సందేహం. మూవీ చూసిన తర్వాత సగం సినిమా కథకి, మిగిలిన సగం ఆ నాలుగు అక్షరాల పదం రాయడానికి రైటర్స్ పారితోషికం తీసుకున్నట్లు అనిపిస్తోంది. విమర్శించడం కాదు కానీ.. ఇటీవల ఓటీటీ సినిమాలను చూస్తుంటే నాకు ఆందోళనగా ఉంది’ అని విమర్శించాడు.


దీనికి సమాధానంగా చందన్ రాయ్.. ‘ఒక్కో ప్రాజెక్ట్ నుంచి ఎంత పారితోషికం వస్తుందో నా కొడుకును ఎప్పుడూ అడగను. కాబట్టి నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. కానీ మళ్లీ ఎప్పుడైనా అతనితో మాట్లాడితే దీని గురించి అడుగుతాను. కానీ ఈ రోజుల్లో యువత అవలీలగా ఆ బూతు పదాన్ని వాడుతున్నట్లు నేను గమనించాను. కాబట్టి ఇలాంటి వీటి గురించి ఆలోచించడంలో అర్థం లేదు’ అని చెప్పుకొచ్చాడు.




మరో నెటిజన్.. ‘సుమిత్‌ని కథలు, డైలాగ్స్ రాయడం ఆపేసి, స్కూల్‌లో జాయిన్ అవ్వమని చెప్పండి’ అని ఘాటు కామెంట్ చేయగా.. ‘ఈ సినిమా కథ నీ ఆలోచనని మించి ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని అర్థం చేసుకోడానికి నువ్వే ఇంకా చదవాలి’ అని అదే స్థాయిలో రిప్లై ఇచ్చాడు.



Updated Date - 2022-02-16T18:22:34+05:30 IST