Geetha Arts 2 కొత్త చిత్రం ప్రారంభం..దర్శకుడెవరంటే..

ABN , First Publish Date - 2022-06-30T18:44:25+05:30 IST

విభిన్నమైన కథలతో కంటెంట్ ఓరియంటెట్‌గా సినిమాలు నిర్మిస్తూ హిట్స్ అందుకుంటుంది ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures). భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే

Geetha Arts 2 కొత్త చిత్రం ప్రారంభం..దర్శకుడెవరంటే..

విభిన్నమైన కథలతో కంటెంట్ ఓరియంటెట్‌గా సినిమాలు నిర్మిస్తూ హిట్స్ అందుకుంటుంది ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures). భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి చిత్రాలు ఈ తరహాలో వచ్చినవే. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పక్కా కమర్షియల్ లాంటి కమర్షియల్ సినిమాతో మ‌రోమారు ప్రేక్ష‌కుల ముందుకు వస్తుంది ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్. 


'జోహార్', 'అర్జున ఫల్గుణ' లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని (Teja Marni) దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny vas) నిర్మాణంలో పూర్తిగా కథ ప్రధానంగా సాగే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు మొద‌లుపెట్టారు. ఈ చిత్రం నేడు హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు బన్నీ వాస్ త‌న‌య‌ బేబీ హన్విక (Baby Hanvika) క్లాప్ కొట్టారు. 


ఈ సినిమాకు బ‌న్నివాసుతో పాటు విద్య మాధురి (Vidhya Madhuri) మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ (Srikanth), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Saratkumar), రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Sivani Rajashekhar) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్ర‌తాప్ సహ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Updated Date - 2022-06-30T18:44:25+05:30 IST