Gautham Karthik: శుభవార్త చెప్పిన కోలీవుడ్ హీరో.. త్వరలోనే..

ABN , First Publish Date - 2022-08-19T00:54:12+05:30 IST

నిన్నటి తరం హీరో కార్తిక్ (Karthik) కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు గౌతమ్ కార్తిక్ (Gautham Karthik). కోలీవుడ్‌లో కొత్త రకం కథలకు కేరాఫ్

Gautham Karthik: శుభవార్త చెప్పిన కోలీవుడ్ హీరో.. త్వరలోనే..

నిన్నటి తరం హీరో కార్తిక్ (Karthik) కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు గౌతమ్ కార్తిక్ (Gautham Karthik). కోలీవుడ్‌లో కొత్త రకం కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మరాడు. తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితానికీ సంబంధించిన ఓ ఆసక్తికర సంగతిని అభిమానులతో పంచుకున్నాడు. 


తాను ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్టు గౌతమ్ కార్తిక్ తెలిపాడు. కానీ, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరును మాత్రం బయటికి వెల్లడించలేదు. ఆమె గోప్యతకు భంగం కలిగించకూడదు అనుకుంటున్నట్టు తెలిపాడు. అందువల్లే పేరును బయటికీ తెలపడం లేదని చెప్పాడు. సరి అయిన సమయంలో ఆ వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నాడు. హీరోయిన్ మంజిమా మోహన్ (Manjima Mohan)తో గౌతమ్ కార్తిక్ డేటింగ్ చేస్తున్నాడని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ‘దేవరట్టం’ (Devarattam) సినిమా చేస్తున్నప్పుడు వీరికి పరిచయం ఏర్పడిందట. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కానీ, ఈ వదంతులను మంజిమా మోహన్ కొట్టి పారేసింది. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేయకూడదని కోరింది. తన తల్లిదండ్రలు బాధపడతారని పేర్కొంది. ప్రస్తుతం గౌతమ్ కార్తిక్ ‘1947 ఆగస్టు 16’ (1947 August 16) లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏఆర్. మురుగదాస్ (A.R. Murugadoss) నిర్మిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థలోను మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో శింబు, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - 2022-08-19T00:54:12+05:30 IST