SRK wife Gauri Khan: ఆమెకి ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయొద్దని చెబుతా..

ABN , First Publish Date - 2022-09-19T19:02:54+05:30 IST

బాలీవుడ్‌లోని టీవీ షోలలో ‘కాఫీ విత్ కరణ్(Koffee With Karan)’ షోకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే...

SRK wife Gauri Khan: ఆమెకి ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయొద్దని చెబుతా..

బాలీవుడ్‌లోని టీవీ షోలలో ‘కాఫీ విత్ కరణ్(Koffee With Karan)’ షోకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లని పూర్తి చేసుకుంది. తాజాగా ఏడో సీజన్ మొదలైంది. ఈ షోలో ఇప్పటికే ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పటికే 11 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకున్న ఈ షో కొత్త ఎపిసోడ్ ప్రొమో తాజాగా విడుదలైంది. 


అందులో.. ఈ షో తాజా ఎపిసోడ్‌కి బాలీవుడ్ సెలబ్రిటీల భార్యలు గౌరీ ఖాన్ (Gauri Khan), మహీప్ కపూర్, భావనా ​​పాండే అతిథులుగా వచ్చారు. ఈ షోలో భాగంగా కరణ్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలను సమాధానాలు చెబుతూ.. వారు కుటుంబం గురించి భర్తల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. పార్టీ సమయంలో షారుఖ్ ప్రవర్తన గురించి గౌరీ మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసిన ప్రతిసారి షారుఖ్ అతిథులను కారు వరకు దిగబెడుతుంటాడు. అందుకే పార్టీ సమయంలో ఆయన ఇంట్లో కంటే బయటే ఎక్కువ సమయం గడిపినట్లు నాకు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో కాకుండా రోడ్డు మీద పార్టీ చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎంతోమంది గెస్ట్స్ ఆయనని వెతుకుతూ ఉంటారు. దాని వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటా’ అని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా.. షారుఖ్‌ ఖాన్‌(Shah Rukh Khan)తో  తన పెళ్లి జరిగిన విధానం గురించి గౌరీ మాట్లాడుతూ.. ‘‘మా వివాహం చాలా గందరగోళంగా, విచిత్ర సంఘటనల మధ్య జరిగింది. అది చూస్తే నాకు షారుఖ్ నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ గుర్తొస్తుంది’’ అని తెలిపింది. అలాగే.. కూతురు సుహానా ఖాన్ (Suhana Khan) గురించి గౌరీ ఖాన్.. ‘నిజంగా నా కూతురుకి సలహా ఇవాల్సి వస్తే.. ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయొద్దని మాత్రం చెబుతా’ అని చెప్పింది. ఈ కొత్త పూర్తి ఎపిసోడ్ వచ్చే గురువారం ప్రసారం అవుతుంది.


కాగా.. గౌరీ ఖాన్ తాజాగా నీలమ్ కొఠారి, సీమా సజ్‌దేహ్‌ కలిసి దర్శకత్వం వహించిన సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ షో ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్‌’లో కనిపించింది. కాగా.. ఇటీవలే ప్రసారమైన ఈ షో రెండో సీజన్‌లో భావన,  మహీప్ కనిపించారు. ఈ షోలో బాలీవుడ్ సెలబ్రిటీల భార్యల లైఫ్ స్టైల్‌ని చూపించారు. అయితే.. ఈ రెండు సీజన్లలోనూ గౌరీ ఖాన్ పలుమార్లు కనిపించడం విశేషం.



Updated Date - 2022-09-19T19:02:54+05:30 IST