Aryan Khan Drugs case: అదో భయంకరమైన అనుభవం.. సంచలన వ్యాఖ్యలు చేసిన తల్లి గౌరీఖాన్

Twitter IconWatsapp IconFacebook Icon
Aryan Khan Drugs case: అదో భయంకరమైన అనుభవం.. సంచలన వ్యాఖ్యలు చేసిన తల్లి గౌరీఖాన్

బాలీవుడ్‌లోని పాపులర్ టీవీ షోలలో ‘కాఫీ విత్ కరణ్ (Koffee with Karan)’ షో టాప్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ టాక్ షో ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకోగా.. తాజాగా ఏడో సీజన్ మొదలైంది. ఈ షోకి ఇప్పటికే ఆలియాభట్, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ వంటి సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. తాజాగా ఎపిసోడ్‌కి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) భార్య గౌరీ ఖాన్(Gauri Khan), మహిప్ కపూర్, భావనా పాండేతో కలిసి వచ్చింది. ఆమె చాలా ఏళ్ల తర్వాత కాఫీ విత్ కరణ్ షోకి విశేషం. ఈ తరుణంలో తన కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) అరెస్టు గురించి గౌరీ స్పందించింది. 


ఆ షో హోస్ట్ కరణ్ జోహార్ (Karan Johar) మాట్లాడుతూ.. ‘డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు అయినప్పుడు మీ కుంటుంబం మొత్తం చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ వాటన్నింటిని తట్టుకుని నిలవగలిగారు. ఆ కష్టం సమయం గురించి ఏమని చెబుతారు’ అని గౌరీని అడిగాడు. దానికి గౌరీ బదులిస్తూ.. ‘అవును. కుటుంబంగా మేము చాలా బాధపడ్డాం. ఇబ్బంది పడ్డాం. తల్లిగా నాకు ఇంతకంటే భయకరమైన అనుభవం ఇంకోటి ఉండదు. కానీ మనందరం ఓ కుటుంబంగా కలిసి బయటపడగలిగాం. అంతేకాకుండా.. అందరూ ప్రేమించే, అభిమానించే స్థానంలో మేము ఉన్నామని నాకు తెలుసు. అందుకే ఎంతోమంది మేస్సేజులు, కాల్స్ ద్వారా నన్ను పలకరించి ఓదార్చారు. దానికి నేను అదృష్టవంతురాలని ఫీల్ అవుతున్నా. ఇలాంటి కష్ట సమయాల్లో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. కాగా.. షారుఖ్, గౌరీ పిల్లలలో ఆర్యన్ ఖాన్ పెద్దవాడు. వీరికి సుహానా ఖాన్ అనే కుమార్తె, అబ్‌రామ్ ఖాన్ అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. కాగా.. ఆర్యన్ చిత్రనిర్మాత కొనసాగాలని కోరుకుంటుండగా.. దర్శకురాలు జోయా అక్తర్ ‘ది ఆర్చీస్‌’లో సుహానా నటిస్తుంది.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.