సహజ నటనకు కేరాఫ్ అడ్రస్ సాయిపల్లవి (Sai pallavi). తాజాగా ‘విరాట పర్వం’ చిత్రంలో వెన్నెలగా అలరించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె ‘గార్గి’ (gargi)అనే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్ రామచంద్రన్ (Goutham ramachandran)దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. మే 9న సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ను సాయిపల్లవి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇచ్చారు. ఈ నెల 15న ‘గార్గి’ చిత్రం విడుదల కానుందని సాయి పల్లవి పోస్టర్ను షేర్ చేశారు. ఈ నెల 15 నుంచి ‘గార్గి’ మీదే అంటూ పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె లుక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా ఈ ఫీమెల్ ఓరియంటెడ్ సినిమాను నిర్మిస్తున్నారు. 96 సినిమాకు సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ చిత్రానికి స్వరకర్త. (Gargi releasing on 15 july)