Ranbir Kapoor ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగగా.. Alia Bhatt ఇచ్చిన సమాధానమిది..

ABN , First Publish Date - 2022-02-28T21:11:01+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న

Ranbir Kapoor ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగగా.. Alia Bhatt ఇచ్చిన సమాధానమిది..

అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న నటి అలియా భట్. చిన్నవయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. హీరోయిన్ ఓరియెంటేడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా అలియా నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలయింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తన ఆనందాన్ని ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆసక్తికర కబుర్లను తెలిపింది. 


సెలబ్రెటీగా ఉండటం అంత సులభం కాదంటోంది అలియా భట్. అభిమానులు ఎప్పుడూ మన మీద నిఘా ఉంచుతారని చెప్పింది. నటి ప్రైవేట్ జీవితాన్ని తెలుసుకోవడానికి అందరు ఇష్టపడతారని పేర్కొంది. సెలబ్రెటీ కావాలంటే పబ్లిక్‌గా ఉండటానికి కూడా ఇష్టపడాలని వివరించింది. అందువల్లే ప్రముఖులు ప్రైవేటు జీవితాన్ని గోప్యంగా ఉంచుతారని స్పష్టం చేసింది. రణ్ బీర్ కపూర్‌తో గత కొంతకాలంగా అలియా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందువల్లే తన రిలేషన్ షిప్‌కు సంబంధించిన విషయాలను ఆమె గోప్యంగా ఉంచుతుంది. 


రణ్ బీర్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగగా ఆమె స్పందించింది. ‘‘భోజనం ఎక్కడ చేస్తాను, రణ్ బీర్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనే విషయాలను చెప్పడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే అది ఎవరికీ అవసరం లేదు. కానీ, కొంత మంది పుకార్లను వ్యాప్తి చేస్తూ, దాని గురించి మాట్లాడుతున్నారు’’ అని అలియా తెలిపింది.

Updated Date - 2022-02-28T21:11:01+05:30 IST