Gangster Gangaraju: రిలీజ్ ప్లాన్ మార్చారు

ABN , First Publish Date - 2022-05-10T02:46:01+05:30 IST

చదలవాడ బ్రదర్స్ (Chadalavada Brothers) సమర్పణలో.. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ (STTV Films) పతాకంపై పద్మావతి (Padmavathi) చదలవాడ నిర్మిస్తున్న చిత్రం

Gangster Gangaraju: రిలీజ్ ప్లాన్ మార్చారు

చదలవాడ బ్రదర్స్ (Chadalavada Brothers) సమర్పణలో.. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ (STTV Films) పతాకంపై పద్మావతి (Padmavathi) చదలవాడ నిర్మిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ (Gangster Gangaraju). ‘వలయం’ (Valayam) ఫేమ్ లక్ష్ (Laksh) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇషాన్ సూర్య (Eeshaan Suryaah) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 24న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతూనే.. మరోవైపు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్రయూనిట్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకోగా... లిరికల్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్‪గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన టీజర్ సినిమాపై మంచి క్రేజ్‪ను క్రియేట్ చేసింది. ప్రేక్షకుల స్పందన చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. 


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికర కథతో గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని, అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో.. జూన్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ (Sai Kartheek) సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2022-05-10T02:46:01+05:30 IST