Gandharva: 500 థియేటర్లతో ‘గంధర్వ’

Twitter IconWatsapp IconFacebook Icon
Gandharva: 500 థియేటర్లతో గంధర్వ

సందీప్‌ మాధవ్‌(Sandeep madhav), గాయత్రి ఆర్‌. సురేష్‌ (gayatri r suresh) జంటగా నటించిన ‘గంధర్వ’ (Gandharva)చిత్రం ఈ నెల 8న 500కి పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఫన్నీ  ప్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సురేష్‌ కొండేటి ఎస్‌.కె. ఫిలిమ్స్‌ సహకారంతో యాక్షన్‌ గ్రూప్‌ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్‌ దర్శకుడు. ఇటీవల పలువురు సినీ ప్రముఖులకు ప్రివ్యూ చూపించగా చక్కని ఫీడ్‌బ్యాక్‌ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయని నిర్మాతలు చెబుతున్నారు.  కొత్త పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం చక్కని భావోద్వేగాల్ని పంచుతుందని దర్శకుడు చెప్పారు. సురేష్‌ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. రాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి జవహర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. (Gandharva on 8th july). 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.