ప‌బ్ ఇష్యూలో నా పేరు ఎలా వ‌చ్చిందో తెలీదు: గల్లా అశోక్

ABN , First Publish Date - 2022-04-04T22:58:41+05:30 IST

ఇటీవల వచ్చిన ‘హీరో’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జ‌య‌దేవ్ ఇంటి నుంచి, అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన సినిమా ‘హీరో’. కౌబాయ్ నేప‌థ్యంలో..

ప‌బ్ ఇష్యూలో నా పేరు ఎలా వ‌చ్చిందో తెలీదు: గల్లా అశోక్

ఇటీవల వచ్చిన ‘హీరో’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జ‌య‌దేవ్ ఇంటి నుంచి, అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన సినిమా ‘హీరో’. కౌబాయ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా.. అశోక్ గ‌ల్లాకు న‌టుడిగా మంచి గుర్తింపునే ఇచ్చింది. ఈ నేపథ్యంలో అంతా ఆయన చేసే రెండో సినిమా ఏమై ఉంటుందా? అనే అనుకుంటూ ఉంటారు. కానీ సడెన్‌గా హైదరాబాద్‌లో దుమారం రేపుతున్న పబ్ ఇష్యూలో అతని పేరు వినబడింది. అయితే వెంటనే గల్లా ఫ్యామిలీ రియాక్ట్ అవడమే కాకుండా.. అశోక్‌కి ఎటువంటి సంబంధం లేదని, దయచేసి ఇటువంటి వార్తలు పుట్టించవద్దని కోరింది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన గల్లా అశోక్‌‌కి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది.


‘రెండు రోజుల క్రితం ప‌బ్ ఇష్యూలో మీ పేరు కూడా వినిపించింది. అప్పుడెలా అనిపించింది?’ అనే ప్రశ్నకు గల్లా అశోక్ సమాధానమిస్తూ.. ‘‘ఆరోజు నేను ఫిజియో థెర‌పీ చేయించుకుంటున్నాను. సడన్‌గా వార్త‌ల్లో నా పేరు ఎలా వ‌చ్చిందో తెలీదు. అప్పుడు నిజంగా నాకు హీరో అనే ఫీలింగ్ కలిగింది. సెల‌బ్రిటీ లైఫ్‌‌లో ఉంటే ఇలానే రూమర్లు వ‌స్తుంటాయ‌నిపించింది..’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2022-04-04T22:58:41+05:30 IST