వాళ్ల ప్రేమ వెలకట్టలేనిది: రాధికా శరత్ కుమార్

ABN , First Publish Date - 2022-04-10T01:01:13+05:30 IST

రాధికా శరత్ కుమార్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న జీ2 ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘గాలివాన’. బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో జీ5 సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ‘తిమ్మరుసు’ ఫేమ్‌ శరణ్‌ కొప్పిశెట్టి

వాళ్ల ప్రేమ వెలకట్టలేనిది: రాధికా శరత్ కుమార్

రాధికా శరత్ కుమార్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న జీ2 ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘గాలివాన’. బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో జీ5 సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ‘తిమ్మరుసు’ ఫేమ్‌ శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏప్రిల్ 14 నుండి జీ5లో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీమ్ మొత్తం హాజరైంది. 


ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటి రాధిక మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రజలకు నేను రుణపడి ఉన్నాను.. ఎందుకంటే ఎప్పటినుండో నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళ ప్రేమ వెలకట్టలేనిది. శరత్‌గారు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు. తనని చిరంజీవిగారి దగ్గర చూసేదాన్ని. ఆయన నన్ను కలిసి వెబ్‌ సిరీస్‌ కథ చెప్పడం జరిగింది. నేను ఇప్పటివరకు ఏ భాషలోనూ వెబ్‌ సిరీస్‌ చేయలేదు. సినిమాలలో చాలా పాత్రల్లో నటించాను. కథ నచ్చడంతో ఈ ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ చేశాను. కథ అయితే అందంగా చాలా బాగా చెప్పారు. దీన్ని ఎలా తీస్తారు అనుకున్నాను. ఇక్కడకి వచ్చిన తర్వాత ఈ టీం డెడికేషన్ చూసి రియల్‌గా ఇంప్రెస్ అయ్యాను. మంచి ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి చాలా బాగా డీల్ చేశాడు. అలాగే ఒక మంచి పాత్ర చేసిందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం వల్ల నాకు మంచి అనుభవం వచ్చింది. సాయికుమార్‌గారితో చాలా సినిమాలలో నటించే అవకాశం వచ్చి మిస్సయినా.. ‘గాలివాన’లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎక్సలెంట్‌గా వర్క్ చేశారు. జీ5, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శరత్‌గారు వండర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి మంచి సబ్జెక్ట్ రావడం వల్ల  జీ5 పై వీక్షకులకు రెస్పెక్ట్  పెరుగుతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.  


నటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘అందరూ డైలాగ్ కింగ్ సాయికుమార్ అంటారు. కానీ ఈ స్వరం నాకు నాన్నగారిచ్చారు. సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది. అనుగ్రహం ఆ భగవంతుడిది. ఆశీర్వాదం, అభిమానం మీ అందరిదీ. అలా పోలీస్ స్టోరీ ద్వారా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మొదట కన్నడలో విడుదలైన పోలీస్ స్టోరీ సినిమా ద్వారా అక్కడి ప్రజలు నన్ను హీరోని చేశారు. అక్కడి నుంచి ఎన్నో అద్భుతమైన వేషాలు వేయడం జరిగింది. సావిత్రిగారి దగ్గరనుంచి అందరితో వర్క్ చేశాను కానీ.. ఒక్క రాధికగారితో మాత్రం మిస్ అయింది. మా నాన్నగారు రాధిక గారు నటించిన న్యాయం కావాలి సినిమాలో జడ్జిగా యాక్ట్ చేశారు. నాకు ఇప్పటికి రాధికగారితో వర్క్‌ చేసే అవకాశం వచ్చింది. ఆమెతో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఓటీటీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. శరణ్‌ వంటి యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ టీంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు మంచి ఎమోషన్స్‌తో పాటు ఫుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ అండ్‌ థ్రిల్‌ను కలిగిస్తుంది..’’ అని తెలిపారు.


ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత శరత్ మరార్, జీ5 తెలుగు ఒరిజినల్‌ కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పద్మా కస్తూరి రంగన్‌, దర్శకుడు శరణ్‌ గోపిశెట్టి, కృష్ణ చైతన్య, చాందిని వంటి వారు మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిన విధానం గురించి చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ప్రేక్షకులను ఈ వెబ్ సిరీస్ ఎంటర్‌టైన్ చేస్తుందని తెలుపుతూ.. సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-04-10T01:01:13+05:30 IST