రెండు ఓటీటీలలో F-3

ABN , First Publish Date - 2022-07-14T02:05:00+05:30 IST

వినోదాత్మక ప్రాంచైజీగా రూపొందిన సినిమా ‘ఎఫ్-3’(F-3). అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించాడు. విక్టరీ వెంకటేష్(Venkatesh) , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా నటించారు.

రెండు ఓటీటీలలో F-3

వినోదాత్మక ప్రాంచైజీగా రూపొందిన సినిమా ‘ఎఫ్-3’(F-3). అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించాడు. విక్టరీ వెంకటేష్(Venkatesh) , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా నటించారు. తమన్నా (Tamannaah), మెహరీన్ (Mehreen), సోనాల్ చౌహాన్ హీరోయిన్‌లుగా నటించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మే 27న విడుదలైంది. అభిమానులను ఆకట్టుకుంది. ‘ఎఫ్-2’ మాదిరిగానే ‘ఎఫ్-3’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 130కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ ఈ మూవీ రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.  


‘ఎఫ్-3’ రెండు ఓటీటీలలో విడుదల కానుంది. సోనీ లివ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులను అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం జులై 22నుంచి రెండు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలపింది. ‘‘ట్రిపుల్ ఫన్, ట్రిపుల్ ఫన్నీ, ట్రిపుల్ ద ఫ్రస్టేషన్. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎఫ్-3’ తెలుగులో జులై 22నుంచి అందుబాటులో ఉంటుంది’’ అని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ‘ఎఫ్-3’ లో రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 



Updated Date - 2022-07-14T02:05:00+05:30 IST