Jalsa: ‘జల్సా’ని ఎగబడి చూస్తున్న యువత

ABN , First Publish Date - 2022-09-02T02:00:18+05:30 IST

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ‘జల్సా’ (Jalsa) మళ్లీ సెప్టెంబర్ 1వ తేదీన (నేడు) విడుదలైంది. అయితే ఒక పెద్ద సినిమా ఎలా విడుదలవుతుందో.. అంత పెద్దగా ఈ సినిమా రీ రిలీజైంది. ముఖ్యంగా

Jalsa: ‘జల్సా’ని ఎగబడి చూస్తున్న యువత

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ‘జల్సా’ (Jalsa) మళ్లీ సెప్టెంబర్ 1వ తేదీన (నేడు) విడుదలైంది. అయితే ఒక పెద్ద సినిమా ఎలా విడుదలవుతుందో.. అంత పెద్దగా ఈ సినిమా రీ రిలీజైంది. ముఖ్యంగా యువత ఈ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మొదటిరోజు ఒక పెద్ద సినిమా ఎలా వేస్తారో, అలానే ఈ ‘జల్సా’ సినిమాని కూడా 15 షోస్ వేశారు. ఉదయం 8.45 నుండి ఆటలు ప్రారంభమయ్యాయి. కాలేజీ స్టూడెంట్స్ ఇంకా చాలామంది యువత ఈ సినిమాని చూస్తున్నారు. ఈ సినిమా మొదటిసారి విడుదలైనప్పుడు వారంతా 3 ఏళ్ళు లేదా 7 ఏళ్ళు ఉంటాయట. ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమా చూస్తున్నాం, మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అద్భుతం ఈ ఎక్స్‌పీరియన్స్ అని అంటున్నారు. ఓటిటిలో చూశాం.., కానీ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో అనుకునే సమయంలో.. పవర్ స్టార్ (Power Star) పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా వేశారు. ఈ అవకాశం వదులుకోకూడదని, కాలేజెస్ బంక్ కొట్టి మరీ ఈ సినిమా చూశారు చాలామంది కుర్రాళ్ళు. పవన్ కళ్యాణ్ క్రేజ్ బాగా పెరిగింది అనడానికి ఇదొక ఉదాహరణ.


ఇప్పటి వరకు మొత్తం 600కి పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమా నడుస్తోందని, ఫ్యాన్స్ ఇంకా కొన్ని షోస్ కావాలంటున్నారని, అందుకని శుక్రవారం కూడా కొన్ని షోస్ వేసే అవకాశం ఉందని, పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి (Pradeep Reddy) చెప్పారు. ఇప్పటి వరకు.. సుమారు 4 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసిందని, ఇంకా మరికొన్ని ప్రాంతాల నుండి కలెక్షన్ల సమాచారం రావాలని చెప్పారు. ఈ వసూళ్లు చూస్తుంటే.. తమ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో అర్థమవుతోందని చెప్పారు. ఈ షోస్ ద్వారా వచ్చిన డబ్బంతా.. పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర (Koulu Rythu Bharosa Yatra)లో రైతులకి చేస్తున్న సహాయానికి ఇచ్చేస్తామని చెప్పారు. ఒక సోషల్ కాజ్ కోసమే ఇదంతా చేశాము, అభిమానులు ఉత్సాహంగా సపోర్ట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.


పవన్ కళ్యాణ్ స్వతహాగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోరు. అందుకని అభిమానులు తమకి తోచిన విధంగా అన్నదానాలు, రక్త దానాలు ప్రతి జిల్లాలోనూ నిర్వహిస్తున్నారని తెలిసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఉదయం హైదరాబాద్‌లో కూకట్‌పల్లి నుండి మూసాపేట్ వరకు ఒక బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నట్లుగా ప్రదీప్ రెడ్డి చెప్పారు.

Updated Date - 2022-09-02T02:00:18+05:30 IST