Laal Singh Chaddha: లాల్ సింగ్ చడ్డా ఒరిజినల్ వెర్షన్ Forrest Gump కు రూ.400 కోట్లు పెడితే.. ఎంత కలెక్షన్లు వచ్చాయో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-08-10T17:16:25+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమీర్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఆగస్టు 11న విడుదలకానున్న ఈ చిత్రంలో కరీనా కపూర్..

Laal Singh Chaddha: లాల్ సింగ్ చడ్డా ఒరిజినల్ వెర్షన్ Forrest Gump కు రూ.400 కోట్లు పెడితే.. ఎంత కలెక్షన్లు వచ్చాయో తెలిస్తే..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమీర్ ఖాన్(Aamir khan) దాదాపు నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’. ఆగస్టు 11న విడుదలకానున్న ఈ చిత్రంలో కరీనా కపూర్, టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం 1994లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. ఆమీర్ సినిమా విడుదల అవుతున్న ఈ తరుణంలో మూవీ ఫలితం, కలెక్షన్లు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం..


టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం దాదాపు 55 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. విడుదల అనంతరం 678 మిలియన్ డాలర్లు.. అంటే రూ.5300 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా 6 ఆస్కార్‌లను గెలుచుకుంది. అయితే కలెక్షన్ల పరంగా, అవార్డుల పరంగా విజయాలు సాధించినప్పటికీ ఈ సినిమా నష్టాలను చవిచూసింది. దానికి కారణం ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్య నిపుణులు ఈ చిత్రానికి విజయవంతమైన వైఫల్యం అనే ట్యాగ్ ఇచ్చారు.


ఇక్కడ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే.. పెట్టిన బడ్డెట్‌ కంటే 10 రెట్లు కలెక్లన్లని సాధించిన ఈ సినిమా నష్టాల్లోకి ఎలా వెళ్లిందనేది. వాస్తవానికి, ఈ చిత్రం విన్‌స్టన్ గ్రూమ్ రచించిన నవల ‘ఫారెస్ట్ గంప్‌’ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే హక్కులను కొనుగోలు చేసేందుకు మేకర్స్ విన్‌స్టన్‌కు 350,000 డాలర్లు అంటే దాదాపు రూ.3 కోట్లు ఇచ్చారు. ఇది కాకుండా, విన్‌స్టన్ ఈ చిత్రానికి వచ్చే లాభాల్లో 3 శాతం వాటాను డిమాండ్ చేశాడు. సినిమా విడుదలైన తర్వాత డిస్ట్రిబ్యూటర్ పారామౌంట్, చిత్ర నిర్మాతలు విన్‌స్టన్‌కు లాభాలలో వాటా ఇవ్వలేదు. చిత్రం 62 మిలియన్లు డాల్లర్లు అంటే రూ.490 కోట్లు నష్లాల్లో ఉందని చెప్పారు.


అయితే.. అనంతరం ఈ చిత్రం అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యి.. 6 ఆస్కార్‌లను గెలుచుకుంది. ఏ సందర్భంలోనూ మేకర్స్ విన్‌స్టన్‌కు క్రెడిట్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన విన్‌స్టన్, మేకర్స్‌పై న్యాయపోరాటం చేశాడు. దీని కారణంగా మేకర్స్ అతనికి 1.97 కోట్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అంతేకాకుండా.. రచయిత క్రెడిట్ నష్టం, లాభంలో వాటా తీసుకోవడం, నటులు ఫీజు తీసుకోకుండా లాభాలను పంచుకోవడం, పంపిణీ వ్యయం పెరగడం, మార్కెటింగ్‌, ప్రింట్‌, అడ్వర్టైజ్‌మెంట్‌కు కోట్లతో ఖర్చు చేయడం వల్ల కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం నష్టాల్లోనే మిగిలింది. ముఖ్యంగా హీరో ట్యాంక్స్ దాదాపు తన వాటాగా దాదాపు రూ.500 కోట్లు తీసుకున్నాడు. అలాగే.. డైరెక్టర్ రాబర్ట్ సైతం దాదాపు రూ.300 కోట్లు తీసుకున్నాడు. ఇలాంటి కారణాల వల్ల ఈ సినిమా నష్టాల్లో కూరుకుపోయింది.

Updated Date - 2022-08-10T17:16:25+05:30 IST