Kamal పాటకు వ్యతిరేకంగా కేసు నమోదు

ABN , First Publish Date - 2022-05-15T00:08:42+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసే నటుడు కమల్ హాసన్ ( Kamal Haasan). తాజాగా అతడు నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj)

Kamal పాటకు వ్యతిరేకంగా కేసు నమోదు

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసే నటుడు కమల్ హాసన్ ( Kamal Haasan). తాజాగా అతడు నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ చిత్రం నుంచి మే 12న ఫస్ట్ సింగిల్ ‘పతళ పతళ’ అంటూ సాగే లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యం అందించడంతో పాటు అతడే పాడాడు. ‘పతళ పతళ’ సాంగ్‌‌లో కేంద్రప్రభుత్వాన్ని వెక్కిరించినందుకు తాజాగా కమల్ హాసన్‌ పాటపై కేసు నమోదైంది.


చెన్నైకు చెందిన సోషల్ యాక్టివిస్ట్ సెల్వం ఈ కంప్టైట్‌ను దాఖలు చేశాడు. ‘పతళ పతళ’ సాంగ్‌లోని లిరిక్స్ కేంద్రప్రభుత్వాన్ని వేళాకోళం చేస్తున్నట్టున్నాయని ఆరోపించాడు. కరోనా నిధులను దుర్వినియోగం చేశారనే విధంగా ఈ లిరిక్స్ ఉన్నాయన్నాడు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ సినిమాకు సంగీతం అందిచాడు. పాటను మాస్ నంబర్‪గా డిజైన్ చేశాడు. లిరికల్ వీడియోలో కమల్ హాసన్ అదిరిపోయే స్టెప్పులతో వింటేజ్ గ్రేస్‌ చూపించాడు. యూట్యూబ్‌లో ఈ పాట సంచలనం సృష్టిస్తుండగానే..కమల్ హాసన్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. ‘విక్రమ్’ థియేట్రికల్  ట్రైలర్, ఆడియోని మే 16న చెన్నైలో గ్రాండ్‪గా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ కీలక పాత్రలు షోషిస్తున్నారు.

Updated Date - 2022-05-15T00:08:42+05:30 IST