‘కృష్ణమ్మ’ కోసం...

ABN , First Publish Date - 2022-07-04T07:12:27+05:30 IST

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కృష్ణమ్మ’. సత్యదేవ్‌ కథానాయకుడు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు....

‘కృష్ణమ్మ’ కోసం...

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కృష్ణమ్మ’. సత్యదేవ్‌ కథానాయకుడు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. సోమవారం సత్యదేవ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం సత్యదేవ్‌ లుక్‌ని విడుదల చేసింది. ‘‘ఇంటెన్స్‌ ఉన్న యాక్షన్‌ కథ ఇది. సత్యదేవ్‌ని ఇప్పటి వరకూ ఎవరూ చూడని కోణంలో చూపించబోతున్నాం. ‘కృష్ణమ్మ’ టైటిల్‌ ప్రకటించిన వెంటనే మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంద’’న్నారు దర్శకుడు. లక్ష్మణ్‌, కృష్ణ, అథిరా రాజ్‌, అర్చన, నంద గోపాల్‌, రఘు కుంచె తదితరులు నటించారు. సంగీతం: కాల భైరవ. 

Updated Date - 2022-07-04T07:12:27+05:30 IST