Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఫెయిల్యూర్‌కి ఐదు కారణాలు!

ABN , First Publish Date - 2022-09-17T01:37:32+05:30 IST

సుధీర్‌బాబు, కృతీశెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’(Aa Ammayi Gurinchi Meeku Cheppali). శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సినిమా ప్రేక్షకులకు చేరువ కాకపోవడానికి ఐదు కారణాలున్నాయి.

Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఫెయిల్యూర్‌కి ఐదు కారణాలు!

సుధీర్‌బాబు, కృతీశెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’(Aa Ammayi Gurinchi Meeku Cheppali). శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సినిమా ప్రేక్షకులకు చేరువ కాకపోవడానికి ఐదు కారణాలున్నాయి. (This is why it won't work) అవేంటో చూద్దాం. 

1.  ఇంద్రగంటి  మోహన కృష్ణ (Indraganti Mohan Krishna) సినిమా అనగానే ఫర్వాలేదు, కొంచెం అయినా బాగుంటుంది అని ప్రేక్షకుడుకి చిన్న ఆసక్తి ఉంటుంది. కానీ తీరా ఈ సినిమా చూశాక ూఏంటి ఇంద్రగంటి ఇంత చెత్త సినిమా తీశాడా’ అనిపిస్తుంది థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి. 


2. ప్రతి సన్నివేశం సాగదీేసటట్టుగా ఉంటుంది. ఫస్ట్‌ హాఫ్‌లో సినిమా కథ ఏమి ఉండదు, అంతగా నడవదు కూడా.  బోరింగ్‌గా, స్లోగా ఉంటుంది. ఆలా ఉండటం ఆ ప్రభావం సెకెండాఫ్‌ మీద పడుతుంది. 


3. ఇంద్రగంటి సినిమాల్లో సంగీతం బాగుంటుంది, కానీ ఈ సినిమాలో అదే పెద్ద మైనస్‌. పాటలు అంత బాగోవు, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ఏమి లేదు. 

4. సాహిత్య కుటుంబం నుండి  వచ్చిన ఇంద్రగంటి స్వతహాగా మంచి రచయిత కూడా. అతని ముందు సినిమాలు అన్నిటిలో డైలాగ్స్‌ బాగుంటాయి. కానీ ఈ సినిమాలో డైలాగ్స్‌ అంతగా ఆకట్టుకోలేదు. అలాగే  కథా రచయితగా పూర్తిగా విఫలం అయ్యాడు. కామెడీ కూడా రెగ్యులర్‌గా ఉండేది అనిపిస్తుంది. 


5. చివరి 20 నిమిషాల సినిమా మాత్రమే బాగుంటుంది. ఆ 20 నిమిషాల కోసం రెండు గంటలు కూర్చోవాలా అని అనిపిస్తుంది.  ఎమోషనల్‌  సీన్స్‌ మిస్‌ అయ్యాయి.  అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, కూతురు తల్లిదండ్రుల మఽధ్య  కానీ భావోద్వేగా సన్నివేశాలు అంతగా పండలేదు. అలాంటి సన్నివేశాలు లేవు కూడా! కథ మంచిది లేనప్పుడు నటీనటులు ఎంత బాగా చేసినా అంత ఫలించదు. అందుకనే ఈ సినిమా ప్రేక్షకుడు బయటకి వచ్చాక అన్నీ మర్చిపోతాడు. ఒక్క సన్నివేశం కూడా గుర్తు ఉండదు.


Updated Date - 2022-09-17T01:37:32+05:30 IST