Vaarasudu: ఆకట్టుకుంటున్న ‘రంజితమే’ సాంగ్

ABN , First Publish Date - 2022-11-30T19:36:04+05:30 IST

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారిసు’ (Varisu)..

Vaarasudu: ఆకట్టుకుంటున్న ‘రంజితమే’ సాంగ్

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారిసు’ (Varisu). తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) పేరుతో విడుదల అవుతోంది. నేషనల్‌ క్రష్‌ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ తెలుగు సింగిల్‌ని తాజాగా విడుదల చేశారు. 


నిజానికి ఈ సాంగ్‌ని తమిళంలో కొన్ని రోజుల క్రితమే విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. ఈ తరుణంలోనే తాజాగా తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ‘రంజితమే’ చాలా సరదాగా విజయ్‌ స్టైల్‌లో ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతం అందించిన ఈ పాట రామజోగయ్య శాస్త్రి రాయగా.. అనురాగ్‌ కులకర్ణి, ఎం.ఎం.మానసి పాడారు. రంజితమే పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. దీంతో ఎంతోమంది విజయ్ ఫ్యాన్స్ ఆయన డ్యాన్స్, స్టైల్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.



Updated Date - 2022-11-30T19:36:04+05:30 IST