‘షంషేరా’ నుంచి Ranbir Kapoor ఫస్ట్ లుక్ లీక్

ABN , First Publish Date - 2022-06-18T20:28:26+05:30 IST

విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). చివరగా రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘సంజు’ (Sanju) చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ 2018లో

‘షంషేరా’ నుంచి Ranbir Kapoor ఫస్ట్ లుక్ లీక్

విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). చివరగా రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘సంజు’ (Sanju) చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ 2018లో విడుదలైంది. అనంతరం అతడి నుంచి ఏ సినిమా రాలేదు. తాజాగా అతడు నటించిన చిత్రం ‘షంషేరా’ (Shamshera). బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. వచ్చే వారం నుంచి  ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టాలనుకున్నారు. కానీ, అంతకు ముందే ‘షంషేరా’ లో రణ్‌బీర్ కపూర్‌‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులందరు ఆ పిక్‌ను షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. 


‘షంషేరా’ లో వాణీ‌ కపూర్ (Vaani Kapoor)హీరోయిన్‌గా నటించింది. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో రణ్‌బీర్ పుట్టిన రోజు సందర్భంగా పాక్షికంగా అతడి లుక్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌ను మాత్రం విడుదల చేయలేదు. అధికారికంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయకముందే సోషల్ మీడియాలో ఆ పిక్ లీక్ కావడంతో చిత్ర బృందం షాక్‌కు గురయింది. ఈ ఘటనపై యశ్‌రాజ్ ఫిలిమ్స్ అధికార ప్రతినిధి స్పందించారు. ‘‘ఉదయం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఫస్ట్‌లుక్ లీక్ కావడం దురదృష్టకరం. రణ్‌బీర్ నాలుగేళ్ల తర్వాత వెండి తెర మీద కనిపించబోతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా దీని గురించే చర్చ జరుగుతుందని మాకు తెలుసు. ప్రస్తుతం మా ప్రణాళికలన్నింటిని మార్చుకోవాలి. వచ్చే రెండు రోజుల్లో మరిన్ని అప్‌డేట్‌లను అందిస్తాం’’ అని ఆ అధికార ప్రతినిధి తెలిపారు. 



Updated Date - 2022-06-18T20:28:26+05:30 IST